Earthquake: 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక..!

అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్‌లోనూ వరుసగా భూప్రకంపనలు నమోదయ్యాయి. అదే విధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో కూడా స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, అలాస్కాలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 గా నమోదైంది. భూకంప కేంద్రం భూమికి 48 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించారు. ఇదివరకు కూడా జూలై 17న అలాస్కాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది 36 కిలోమీటర్ల లోతులో నమోదయ్యింది.
ఓ నివేదిక ప్రకారం, అలాస్కాలో భూకంపం తర్వాత అలాస్కా తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరిక జారీ చేయబడ్డాయి. అమెరికా జాతీయ వాతావరణ సేవ ప్రకారం, ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని, తీర ప్రాంతాలను అలాగే జలమార్గాలను విడిచిపెట్టాలనే హెచ్చరికలు జారీ చేశారు. ఇమరోవైపు తజాకిస్తాన్‌లో కూడా 4.6 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇది 23 కిలోమీటర్ల లోతులో చోటు చేసుకుంది. అంతకముందు జూలై 18న 3.8 తీవ్రత, జూలై 12న 4.8 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. ఇవి 160 కిలోమీటర్ల లోతులో నమోదు అయ్యాయి.
ఇక భారత్ లోని జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రత, 10 కిలోమీటర్ల లోతు వద్ద భూకంపం సంభవించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో గత రాత్రి 3.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇది 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com