Indonesia Earthquake: ఇండోనేషియాలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం

Indonesia Earthquake: ఇండోనేషియాలో 6.3 తీవ్రతతో భారీ భూకంపం
X
సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన అధికారులు

ఇండోనేషియాలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవిలోని ఏస్ ప్రావిన్స్ సమీపంలో భూమి తీవ్రంగా కంపించినట్లు ఇండోనేషియా వాతావరణ, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ (బీఎంకేజీ) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు.

భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఈ భూప్రకంపనల ప్రభావంతో ఏస్ ప్రావిన్స్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా కంపించాయి. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

అయితే, ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు ఏమీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలోని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఇండోనేషియా ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.

Tags

Next Story