china : మహిళా ఉద్యోగార్థులకు గర్భనిర్ధారణ పరీక్షలు

ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు చైనా కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాయి. ఇందులో పాజిటివ్ వస్తే ఉద్యోగం ఇచ్చేందుకు సంకోచిస్తున్నాయి. డజనుకుపైగా కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రాగా, ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జియాంగ్షులోని నాన్‌టోంగ్ పట్టణంలో 16 కంపెనీలపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్టు తెలిసింది.
చైనాలో పలు కంపెనీలు వింత పోకడలకు పోతున్నాయి. మహిళలను ఉద్యోగాల్లో నియమించే ముందు గర్భనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా ఇంటర్వ్యూల్లో కుటుంబ నియంత్రణ ప్రణాళికల గురించి ప్రశ్నిస్తున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోయినా, పిల్లల్ని కనాలనుకునే ఉద్దేశమున్నా, గర్భంతో ఉన్నా.. అలాంటి మహిళలను ఇం టర్వ్యూ దశలోనే చైనాలోని పలు కంపెనీలు పక్కకు తప్పిస్తున్నాయి. వారికి ఉద్యో గం ఇవ్వడానికి విముఖత చూపుతున్నాయి. ప్రెగ్నె న్సీ టెస్ట్‌లు అడుగుతున్నాయి. ఈ విషయం కాస్త జిన్‌పింగ్ ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో ఆయా కంపెనీలపై దర్యాప్తునకు ఆదేశించింది. జింగ్సు ప్రావిన్సులోని నాన్‌టాంగ్‌లో ఉద్యోగాల కోసం తమ వద్దకు వచ్చిన 168 మంది మహిళలకు 16 కంపెనీలు ఫిజికల్ టెస్టుల పేరుతో అక్రమంగా గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించాయి. అందులో పాజిటివ్ వచ్చిన ఓ మహిళకు ఉద్యోగం ఇవ్వలేదని, ఒక ఆన్‌లైన్ పబ్లిక్ లిటిగేషన్ సంస్థ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో 16 సంస్థలతో పాటు, పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రులు, ల్యాబ్‌లపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఒక్కో సంస్థపై 6,900 డాలర్ల జరిమానా విధించే అవకాశాలున్నాయి. చైనాలో కంపెనీలు గర్భనిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, లింగ వివక్ష చూపడం నిషేధం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com