Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై స్పందించిన బిడెన్-ఒబామా

ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా బుల్లెట్లు పేల్చారు. అయితే ఆ బుల్లెట్‌ ట్రంప్‌ కుడి చెవికి తగిలి తప్పిపోవడం విశేషం. దాడి తర్వాత అతని చెవులు, ముఖంపై రక్తపు మరకలు కనిపించాయి. అయితే సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది అతడిని అక్కడి నుంచి సురక్షితంగా రక్షించారు. డొనాల్డ్ ట్రంప్‌కు రక్షణగా మోహరించిన భద్రతా సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని హతమార్చారు. ర్యాలీకి వచ్చిన ప్రేక్షకుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఖండించారు. అతను ట్విట్టర్లో .. ‘పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల గురించి నాకు సమాచారం అందింది. అతను క్షేమంగా ఉన్నాడని తెలిసి సంతోషంగా ఉన్నాను. నేను అతని కోసం, అతని కుటుంబం, ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాను. ట్రంప్‌ను సురక్షితంగా తీసుకెళ్లినందుకు సీక్రెట్ సర్వీస్‌కు కృతజ్ఞతలు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదు. దీనిని ఖండించడానికి మనం ఒక జాతిగా ఏకం కావాలి.’ అంటూ రాసుకొచ్చారు.

యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్స్‌లో.. ‘పెన్సిల్వేనియాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ కార్యక్రమంలో జరిగిన కాల్పుల గురించి నాకు సమాచారం అందింది. అతడికి పెద్దగా గాయాలు కాలేదని తెలియడంతో ఉపశమనం పొందాం. మేము అతని కోసం, అతని కుటుంబం, ఈ కాల్పుల్లో గాయపడిన వారందరి కోసం ప్రార్థిస్తున్నాము. సీక్రెట్ సర్వీస్, స్థానిక అధికారులకు కృతజ్ఞతలు. ఇలాంటి హింసకు మన దేశంలో చోటు లేదు. ఈ హేయమైన చర్యను మనమందరం ఖండించాలి. ఈ సంఘటన మరింత హింసకు దారితీయకుండా చూసుకోవడంలో మన వంతు పాత్ర పోషించాలి.’ అని పేర్కొన్నారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. నా స్నేహితుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవున్ని కోరుకుంటున్నా. రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు తావులేదు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని సోషల్‌ మీడియా ఎక్స్‌లో చెప్పారు.

Tags

Next Story