ముగిసిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన.. !

ముగిసిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన.. !
బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మతువా సముదాయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మతువా సముదాయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంవత్సరాలుగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని ఈ సందర్భంగా అన్నారు. ఇన్నాళ్లలకు ఫలించిందన్నారు. ఈ పర్యటనలో భాగంగా మతువా వర్గంతో భేటీ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. బెంగాల్‌లోని ఠాకూర్ నగర్‌లో నేను పర్యటించానని.. ఓ కుటుంబీకునిగా నన్ను ఆదరించారని కొనియాడారు.

ప్రధాని మోదీ బంగ్లాదేశ్ భారత్‌ దేశాల మధ్య ఐదు కీలక అవగాహనా ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల ఉన్నతాధికారులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునేందుకు ఉపయోగపడతాయని ఇరు దేశాల ప్రధానులు ఆశాభావం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ 50 వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని.. 130 కోట్ల భారతీయుల ప్రేమను, ఆప్యాయతను, శుభాకాంక్షలను మోసుకొచ్చానని తెలిపారు. భారత్, బంగ్లాలు రెండూ తమ సొంత పురోగతి సాధించి, ప్రపంచ అభివృద్ధిని కాంక్షిస్తాయన్నారు. అస్థిరత, బీభత్సం, ఉగ్రవాదం లాంటివి కాకుండా ప్రపంచంలో స్థిరత్వం, ప్రేమ, శాంతిని ఇరు దేశాలూ కోరుకుంటున్నాయని ఆయన వివరించారు.

కరోనా సమయంలో కూడా ఇరు దేశాలు తమ తమ శక్తి సామర్థ్యాలను చూపించాయని, ప్రస్తుతం కరోనాను ధీరత్వంతో ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్లను బంగ్లాకు పంపడం తమ విధి నిర్వహణలో భాగంగానే తాము చూస్తున్నామని మోదీ ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ మథువా వర్గానికి చెందిన ప్రజలతో భేటీ అయ్యారు. ఒరాకాండిలోని బాలికల పాఠశాలను, అలాగే ఓ ప్రాథమిక పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు.

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా నరేంద్రమోదీ రెండో రోజు బిజిబిజిగా గడిపారు. షట్ ఖారా జిల్లాలోని ఈశ్వరీపూర్లో గల ప్రసిద్దజేసోరేశ్వర కాళీ మాత ఆలయాన్ని దర్శించుకోగా.. ఆలయ సిబ్బంది సాంప్రదాయబద్దంగా మెదీకి స్వాగతం పలికారు. చేతితో తయారుచేసిన ప్రత్యేక బంగారు ముకుటాన్ని అమ్మవారికి అలంకరించారు. కోవిడ్ మహమ్మారి నుంచి మానవాళికి విముక్తి కలుగాలని కాళీమాతను ప్రార్ధించా అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story