PM Modi: యుద్ధానికిది సమయం కాదు

PM Modi: యుద్ధానికిది సమయం కాదు
ఆస్ట్రియా పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆస్ట్రియాలో పర్యటించారు. ఈ సందర్భంగా యుద్ధానికిది సమయం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆ దేశ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పశ్చిమ ఆసియా, ఉక్రెయిన్‌ సంక్షోభాలు చర్చకు రాగా, ఇది యుద్ధానికి సమయం కాదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్‌, రష్యా శాంతి ప్రక్రియలో భారత్‌ ఎంతో ప్రధానమైనదని, అది శక్తివంతమైన ప్రభావవంతమైన పాత్రను పోషించగలదని ఆస్ట్రియన్‌ చాన్స్‌లర్‌ కర్ల్‌ నెహమ్మార్‌ అన్నారు. అదే సమయంలో తమ దేశం తటస్థ విధానాన్ని అవలంబిస్తుందని అన్నారు. కాగా, 41 ఏండ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించారని, అలాగే ఇరు దేశాల మధ్య దైపాక్షిక బంధం ప్రారంభమై 75 ఏండ్లు పూర్తయ్యాయని తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడైనా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అంగీకార యోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించారు. రానున్న దశాబ్దంలో పరస్పరం సహకరించుకోవడానికి బ్లూప్రింట్‌ను సిద్ధం చేశారు. భేటీ అనంతరం రెండు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మీడియాతో మాట్లాడారు. దాదాపు 40ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి లఖ్‌నవూకు చెందిన విజయ్‌ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో వందేమాతరం గీతంతో ఘన స్వాగతం లభించింది. బుధవారం భేటీ సందర్భంగా మోదీ, నెహమ్మర్‌ ఆలింగనం చేసుకున్నారు. మోదీతో నెహమ్మర్‌ సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య అధికారిక చర్చలు జరిగాయి. ‘ఆస్ట్రియా ఛాన్సలర్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని ప్రస్తుత ఘర్షణలపై మేమిద్దరం చర్చించాం. పశ్చిమాసియాలో ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మా మధ్య చర్చకు వచ్చాయి. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపాను’ అని ప్రధాని మోదీ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

Tags

Next Story