అంతర్జాతీయం

PROJECT SHAKTHI: బాలికా విద్య కోసం లక్ష డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రామ్‌

PROJECT SHAKTHI: భారత్‌లో ఆర్థికంగా వెనుకబడిన బాలికల సాధికారతే ధ్యేయంగా, బాలికా విద్య కోసం లక్ష డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రామ్‌ చేపడుతున్నారు..

PROJECT SHAKTHI: బాలికా విద్య కోసం లక్ష డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రామ్‌
X

PROJECT SHAKTHI.. సరిహద్దులు లేని లక్ష్యం వారిది.. ఆ లక్ష్యంతో, మహోన్నత ఆశయంతో పర్వత శిఖరాలను అధిరోహిస్తున్నారు.. ప్రపంచానికి ఒక కొత్త శక్తిని పరిచయం చేస్తున్నారు.. అమెరికాలోని మహిళా స్పేస్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కావ్య మాన్యపు, పర్వాతారోహణలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్న పూర్ణా మలావత్‌ ఇప్పుడు మరో సాహసోపేతమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రీకారం చుట్టారు.. భారత్‌లో ఆర్థికంగా వెనుకబడిన బాలికల సాధికారతే ధ్యేయంగా, బాలికా విద్య కోసం వీరిద్దరూ లక్ష డాలర్ల ఫండ్‌ రైజింగ్‌ ప్రోగ్రామ్‌ చేపడుతున్నారు.. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు పర్వతారోహణను మార్గంగా ఎంచుకున్నారు..

ఈ ఏడాది ఆగస్టులో ఎవరూ అధిరోహించని లడఖ్‌లోని 20,100 అడుగుల ఎత్తయిన పర్వతాన్ని డాక్టర్‌ కావ్య మాన్యపు, పూర్ణా మలావత్‌ అధిరోహించబోతున్నారు.. ఇది మాత్రమే కాదు, 2023 జనవరిలో సౌత్‌ అమెరికాలోని 22,837 అడుగుల ఎత్తయిన మౌంట్‌ ఎకోంకాగువా శిఖరాన్ని కూడా అధిరోహించబోతున్నారు.. ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా విరాళాలను సేకరించి వాటిని బాలికా సాధికారత కోసం వినియోగించనున్నారు.. డాక్టర్‌ కావ్య మాన్యపు, పూర్ణా మలావత్‌ ఇద్దరూ వారి సొంత ఖర్చులతోనే పర్వతారోహణ చేపడతారు.. దాతలు ఇచ్చే విరాళాల్లో ప్రతి రూపాయి కేవలం ఆర్థికంగా వెనుకబడిన బాలికల విద్య కోసమే ఉపయోగించబడుతుంది..

ప్రతి అమ్మాయికీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. రండి.. ఈ బృహత్‌ కార్యంలో మీరూ చేయి కలపండి. మీ సాయం ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు విద్యను అందించేందుకు తోడ్పడుతుంది.. విరాళాలకు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం +404-394-1565 నంబరుకు వాట్సాప్‌ చేయండి.. మరిన్ని వివరాలకు info.passion2purpose@gmail.com ఈమెయిల్‌ చేయండి.. అలాగే https://passion-2-purpose.org/project-shakthi వెబ్‌ పేజ్‌కి లాగిన్‌ అయి పూర్తి సమాచారం తెలుసుకోండి.

యూఎస్‌ డాలర్ల రూపంలో ఇచ్చే ఎన్‌ఆర్‌ఐ డొనేషన్ల కోసం https://tana.org/payment/donate/projects కు లాగిన్‌ అవ్వండి.. Project Shakthiకి డోనేట్‌ చేయండి.

ఇండియన్‌ కరెన్సీలో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా లేదంటే చెక్కుల రూపంలో విరాళాలు పంపండి.Managing Trustee and Secretary

(Cause: Project Shakthi)

TANA Foundation India

Sree Krishna Sowbhagya Nilayam,

2nd floor, Plot No. 65, Road No. 4.,

Venkateswara Nagar, Vijayawada - 520 008

Next Story

RELATED STORIES