Russia :రష్యాలో మహిళా జర్నలిస్ట్ పై దాడి

రష్యాకు చెందిన నోవాయా గెజిటా వార్తాపత్రికకు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఎలెనా, న్యాయవాది అలెగ్జాండర్ నెమోవ్‌లపై కొంతమంది దుండగులు దాడి చేశారు. స్థానిక విమానాశ్రయం నుంటి వీరిద్దరూ ఒక కారులో చెచ్న్యా రాజధాని గ్రోజ్నీకి ప్రయాణీస్తుండగా ఈ దాడి జరిగింది. స్వలింగ సంపర్కులపై జరిగిన భయంకరమైన అణిచివేతను బయటపెట్టిన రష్యన్ జర్నలిస్ట్, న్యాయవాదులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు వారు ప్రయాణిస్తున్న కారును బలవంతంగా ఆపి దాడి చేశారని, ఈ దాడిలో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. గాయపడిన మిలాషినా, నెమోవ్ ప్రస్తుతం గ్రోజ్నీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ దాడిపై చెచెన్ అధికారులు స్పందించలేదు.
ఈ దాడి గురించి మానవ హక్కుల సంఘం మెమోరియల్ తెలిపిన వివరాల ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు మిలాషినా తలపై ఆకుపచ్చ రంగును పోశారు. ఫోన్ లాక్ ఓపెన్ చెయ్యను అన్న కారణం తో చేతి వేళ్లను విరిచేశారు. తలపై తుపాకీ పెట్టి చంపేస్తామని బెదిరించారు. కారులో ఉన్న వారి సామాగ్రిని పగలగొట్టారు. ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలని, ఇక్కడ జరిగిందేదీ రాయవద్దని దుండగులు ఆమెను బెదిరించారు. అలాగే దుండగులు న్యాయవాది నెమోవ్ కాలిపై కత్తితో పొడిచారని తెలుస్తోంది.
కొంతకాలం క్రితం చెచ్న్యాలోని స్వలింగ సంపర్కులపై అణచివేత, వారిపై అమలు చేస్తున్న శిక్షలకు సంబంధించిన కొన్ని భయంకరమైన వివరాలను ఈమె నోవాయా గెజిటా అనే పత్రికలో వ్యాసంగా రాశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక ముస్లిం మతాధికారులు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. సుమారు 15,000 మంది ప్రజలు ఒక మసీదులో సమావేశమై నోవాయా గెజిటా సిబ్బందికి వ్యతిరేకంగా జీహాద్ ప్రకటించారు. దీంతో మిలాషినా కొంత కాలం పాటు తన ఇల్లు విడిచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మిలాషినా, నెమోవ్‌తో కలిసి చెచ్న్యాలోని ఓ మహిళ పోలీసుపై దాడి చేసిందనే అభియోగంపై న్యాయస్థానం విధించిన శిక్షను కవర్ చేయడానికి వెళుతున్నట్టుగా సమాచారం.
మాస్కోలోని కొంతమంది రష్యన్ అధికారులు, చట్టసభ సభ్యులు, మానవ హక్కుల సంఘాల ఈ దాడిని ఖండించాయి.
1993లోనే మాస్కో అధికారికంగా స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించింది. 2013 నుంచి స్వలింగ సంపర్కం అనే పదం వినిపించడానికి వీల్లేదని.. ఎక్కడా కూడా ఆ పదం వాడకూడదంటూ నిషేధం విధించింది. 2022 లో రష్యా ప్రజా సముదాయాల్లో సాంప్రదాయేతర లైంగిక సంబంధాలపై సమాచారాన్ని నిషేధించే మరిన్ని ప్రతిపాదనలను తీసుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com