వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. అత్యవసర ల్యాండింగ్

వడగళ్ల వాన కారణంగా న్యూయార్క్‌కు వెళ్లే డెల్టా విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. మిలన్ నుంచి న్యూయార్క్ వెళ్లే డెల్టా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎనిమిది మంది ఫ్లైట్ అటెండెంట్లు, ముగ్గురు పైలట్‌లతో కూడిన విమానంలో 215 మంది ప్రయాణికులు ఉన్నారు.
మిలన్ నుండి న్యూయార్క్ వెళ్లే డెల్టా విమానం టేకాఫ్ అయిన వెంటనే అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. విమానం యొక్క ముందు భాగం మరియు రెక్కల దగ్గర ఫ్యూజ్‌లేజ్‌కు బాగా డ్యామేజ్ అయింది. దీంతో ప్యాసింజర్ జెట్‌ను రోమ్ వైపు మళ్లించవలసి వచ్చింది. విమానం బయలు దేరిన 65 నిమిషాలకే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ల్యాండ్ అయింది. ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదు అని అధికారి తెలిపారు.
తీవ్రమైన తుఫాను ప్రయాణీకులను వారి భద్రత గురించి ఆందోళన చెందేలా చేసింది. "మిలన్ నుండి న్యూయార్క్-JFKకి డెల్టా ఫ్లైట్ 185 బయలుదేరిన కొద్దిసేపటికే వాతావరణ సంబంధిత సమస్యను ఎదుర్కొన్న తర్వాత రోమ్‌కు మళ్లించబడింది." అని విమాన అధికారి పేర్కొన్నారు."ఫ్లైట్ రోమ్‌లో సురక్షితంగా దిగింది, అక్కడ ప్రయాణీకులు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com