రేంజ్ రోవర్ కారుతో తొక్కించినా ఈ చిన్న జీవి చావదు.. దీని ప్రత్యేకత ఏంటంటే..

చూడటానికి చిన్నగా.. ఒళ్లు కొద్దిగా జలదరించేలా ఉండే 'డయాబోలికల్ ఐరన్ క్లాడ్ బీటిల్' అనే జీవి ఇప్పుడు శాస్త్రవేత్తలకు హాట్ టాపిక్ అయింది. అంతేకాదు వారి పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ జీవి మీద రేంజ్ రోవర్ కారును పోనిచ్చినా బ్రతికి ఉండగలిగే దృఢమైన శరీరం దీని సొంతం. అందుకే 'పర్డ్యు యూనివర్శిటీ' శాస్త్రవేత్తలు ఈ జీవిపై పరిశోధనలు చేయటం మొదలుపెట్టారు. ఐరన్ లాంటి దాని శరీర ఆకృతిపై ఆసక్తికంగా పరిశోధనలు జరుపుతున్నారు. బలమైన విమానాలు, ఇతర వస్తువుల తయారీ, భవంతుల నిర్మాణంలో అది సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సౌత్ కాలిఫోర్నియాలోని దట్టమైన అడవుల్లో ఈ జీవి నివసిస్తుంది..
ఇది శరీర బరువుకంటే 39 వేల రెట్ల అధిక బరువును తట్టుకోగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అదే ప్రాంతంలో మనుగడ సాగిస్తున్న మరికొన్ని జీవులు వాటి శరీర బరువు కంటే మూడు రెట్ల బరువును వాటి మీద ఉంచితేనే తట్టుకోలేకపోతున్నాయని తేల్చారు.. అయితే ఈ జీవి మాత్రం అంత బలంగా ఎలా ఉందో తెలుసుకోవటానికి సీటీ స్కాన్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లను ఉపయోగించారు.ఈ డయాబొలికల్ ఐరన్‌క్లాడ్ బీటిల్ కు ప్రత్యేక, జిగ్‌షా ఆకారంలోని శరీర బంధనాల నిర్మాణం, పొరలు ఉన్నాయని.. వీటి కారణంగానే అంత బరువును తట్టుకోగలుగుతుందని తేల్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com