అంతర్జాతీయం

గాయకుడి మరణం ఎంత దారుణం.. షూలో క్యాన్సర్ వైరస్ పెట్టి..

అతి చిన్న వయసు(36)లోనే బాబ్ మార్లే క్యాన్సర్‌తో మరణించడం అభిమానులను కలచి వేసింది.

గాయకుడి మరణం ఎంత దారుణం.. షూలో క్యాన్సర్ వైరస్ పెట్టి..
X

అతి చిన్న వయసులోనే పాప్ స్టార్‌గా ఎదిగాడు.. ప్రపంచంలోని సంగీత ప్రియులు అతడి పాటలకు పాదాక్రాంతులయ్యారు. తన్మయత్వంతో ఊగిపోయారు. అతి చిన్న వయసు(36)లోనే బాబ్ మార్లే క్యాన్సర్‌తో మరణించడం అభిమానులను కలచి వేసింది. బాబ్ తన పాటలతో 'న్యాయం కోసం పోరాడండి' అని లక్షాది మంది ప్రజల్లో స్ఫూర్తి నింపేవాడు.. అది అమెరికా ప్రభుత్వానికి మింగుడు పడలేదు. దాంతో అతడిని చంపడానికి ప్లానే వేసింది.. అందులో భాగంగానే ఓ రోజు కొంత మంది వ్యక్తులు అతడి ఇంటిపై తుపాకులతో దాడి చేశారు.. బాబ్ భార్య తలపై తుపాకి గురిపెట్టి కాల్చి చంపారు.

బాబ్ భుజంలోకి బుల్లెట్ దిగింది. అతడి మేనేజర్‌తో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం బాబ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొన్నాళ్లకు క్యాన్సర్ వచ్చి బాబ్ మరణించాడు.. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ ఎవరికీ తెలియన కథ వేరే ఉందంటూ పూరీ జగన్నాథ్ తన మ్యూజింగ్స్‌లో వివరించారు.. వింటే షాకయ్యేలా ఉంది.. ఇంత దారుణంగా ఓ గొప్ప వ్యక్తిని చంపారని తెలిసి బాధకలుగుతుంది. ఈ మథ్యే బాబ్ మార్లే డెత్ సీక్రెట్‌ని చదివిన పూరీ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

బిల్ ఆక్సే అనే వ్యక్తి 80 ఏళ్ల వయసులో చనిపోతూ ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. అతడు అమెరికన్ సీఐఏ ఏజెంట్. అమెరికా ప్రభుత్వం బాబ్ వల్ల తమకు ప్రమాదం ఏర్పడుతుందని భావించింది. అతడిని చంపమని బిల్‌ని నియమించింది. బాబ్ మీద మొదట కాల్పులు జరిపింది కూడా అతడే. అయితే బాబ్ బతికి బట్టకట్టాడు.. అనంతరం అక్కడి నుంచి అందరికీ దూరంగా వెళ్లిపోయాడు.. ఎవరికీ కనిపించని ప్రదేశానికి వెళ్లి తల దాచుకున్నా ఆ రహస్య ప్రాంతాన్ని కనుగొని అక్కడికి కూడా వెళ్లాడు బిల్.. బాబ్ హత్యకు మరో పథకం వేశాడు.

నేను మీ అభిమానిని అంటూ బిల్.. బాబ్‌కి షూ బహుమతిగా ఇచ్చాడు మొదటి కలయికలోనే. తనే స్వయంగా బాబ్ కాళ్లకు ఆ షూస్ తొడిగాడు.. షూ వేసుకున్న మరుక్షణం కుడికాలికి ఏదో గుచ్చుకున్నట్లై బాబ్ బాధతో అరిచాడు.. కంటికి కనిపించని ఆ గుండు సూదిని షూలో నుంచి తీసినా ఈలోపు సూదికి పూసిన క్యాన్సర్ వైరస్ బాబ్ శరీరంలోకి ఎక్కిపోయింది. బాబ్ జీవితంలో జరగకూడనిది జరిగిపోయింది.

ఆ విషయాన్ని బాబ్ పెద్దగా పట్టించుకోలేదు.. గుచ్చుకుంది చిన్న సూదే కదా ఏం చేయదులే అనుకున్నాడు.. కానీ అదే తన ప్రాణాలు హరించే ప్రాణాంతక వైరస్ క్యాన్సర్ అని గుర్తించలేకపోయాడు. బాబ్ కొన్నాళ్లకు చనిపోతాడని బిల్‌కు మాత్రమే తెలుసు. అతడు చనిపోయే వరకు బాబ్ వెన్నంటే ఉండాలని బిల్ నిర్ణయించుకున్నాడు. ఒక అభిమానిగా బాబ్‌తో ఉంటూ.. సేవలు చేస్తూ.. అతడికి మంచి స్నేహితుడు అయిపోయాడు.

ఈ క్రమంలోనే బాబ్ ఆరోగ్యం క్షీణిస్తుంటే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. వైద్యులు బాబ్‌ని పరీక్షించి క్యాన్సర్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకయ్యాడు.. తుపాకీ గుళ్ల నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాను.. ఈ క్యాన్సర్ మహమ్మారి మరణానికి చేరువ చేస్తుందేమో అని మానసిక వేదన చెందాడు.. కానీ బిల్.. అతడికి ధైర్యం అందిస్తూ.. సర్ మీరు బతకాలి.. మీకు మంచి వైద్యం చేయిస్తాను.. నాకు తెలిసిన వైద్యులు ఉన్నారు.. ఎంత ఖర్చైనా పర్వాలేదు.. నేను చూసుకుంటా అని బాబ్‌ని నమ్మించి ప్యారిస్ తీసుకెళ్లాడు.. అక్కడ కొన్నాళ్లు చికిత్స చేసిన ఫలితం కనబడలేదు.. అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం నిమిత్తం లండన్ తీసుకెళ్లాడు.. అక్కడ కూడా తగ్గలేదు.. కారణం బిల్ దగ్గరుండి బాబ్‌కి వైద్యం జరగకుండా చూస్తున్నాడు.

చివరిగా బాబ్‌ని అమెరికా తీసుకువెళ్లి అక్కడ ఓ ఆసుపత్రిలో ఉంచి అతడికి చికిత్స జరగకుండా చూసుకున్నాడు. అక్కడే అతడి ఆఖరి క్షణాలు ముగిసాయి. బిల్ చేతుల్లోనే బాబ్ ప్రాణాలు వదిలాడు. చివరి వరకు నా వెంటే ఉన్నావంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కృతజ్ఞతాభావంతో కన్నుమూశాడు. దేశం కోసం బాబ్‌ని చంపానే కానీ అతడంటే బిల్‌కి చాలా ఇష్టం. నా జీవితంలో 17 మందిని చంపినా.. బాబ్‌ని నమ్మించి, మోసం చేసి చంపడాన్ని తట్టుకోలేకపోతున్నాను.. అంటూ బాధతో బాబ్‌ మరణానికి తానేవిధంగా కారణమైంది తన మరణానికి ముందు బిల్ వివరించాడు. కానీ అమెరికా బిల్ చెప్పింది తప్పంటూ కొట్టిపారేసింది.. ఇలాంటి విషయాలు ఎప్పుడూ రహస్యాలుగానే మిగిలిపోతాయి. ఏదేమైనా ఓ గొప్ప వ్యక్తిని, సింగర్‌ని ప్రపంచం కోల్పోయింది అని పూరీ వివరించారు.

Next Story

RELATED STORIES