Crimea bridge: క్రిమియా బ్రిడ్జి ధ్వంసం.. అధ్యక్షుడు ఆగ్రహం

Crimea bridge: క్రిమియా బ్రిడ్జి ధ్వంసం.. అధ్యక్షుడు ఆగ్రహం
Crimea bridge: క్రిమియా బ్రిడ్జి ధ్వంసంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అగ్రహంతో రగిలిపోతున్నారు.. దీంతో ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్నారు.

Crimea Bridge: క్రిమియా బ్రిడ్జి ధ్వంసంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అగ్రహంతో రగిలిపోతున్నారు.. దీంతో ఉక్రెయిన్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతున్నారు.. తన బలగాలతో దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది రష్యా. గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్‌ ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఉక్రెయిన్‌ సైన్యం ఎదురుదాడిని ఉద్ధృతం చేసింది.

అయితే ఇవాళ రష్యా ఉక్రెయిన్‌ పై భీకర దాడులు చేసింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయంపై మిస్సైళ్లతో దాడి చేసింది రష్యా మిలట్రీ. రాజధాని కీవ్‌ తో సహా పలు నగరాలపై మిస్సైల్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో 24 మంది గాయపడ్డారు. ఏకకాలంలో మిస్సైల్స్‌తో విరుచుకు పడింది రష్యా సైన్యం.

ఇక దొనెట్స్క్, జపోరిజియా, లుహాన్స్క్‌, ఖేర్సన్‌ ప్రాంతాలను తమ దేశంలో విలీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించినా వాటిపై పూర్తి నియంత్రణను ఆ దేశం సాధించలేకపోతోంది. ముఖ్యంగా ఖేర్సన్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌పై భీకర దాడులకు దిగింది రష్యా సైన్యం.

యుద్ధ ట్యాంకర్లు నగరాన్ని చుట్టుముట్టగా, గెరిల్లా దళాలతో ఆర్మీ దాడులకు తెగబడుతోంది.. మూడున్నర నెలల తర్వాత మరోసారి కీవ్‌ లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది.. భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.. కొత్త వార్‌ జనరల్‌ బాధ్యతలు తీసుకున్న కొద్ది గంటల్లోనే కీవ్‌పై భీకర దాడులు చేస్తున్నారు.. రష్యా మిస్సైల్‌ దాడుల్లో మూడు అపార్ట్‌మెంట్లు ధ్వంసమయ్యాయి.. మిస్సైల్‌ దాడుల్లో జెలెన్‌ స్కీ కార్యాలయం కూడా ధ్వంసమైనట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రష్యా ఆక్రమణలో ఉన్న కీలకమైన క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్‌ బలగాలు కూల్చివేశాయి.. ట్రక్కు బాంబులతో వంతెనను పేల్చివేసినట్లుగా సమాచారం.. అయితే, బ్రిడ్జిపై ట్యాంకు పేలడంతోనే బ్రిడ్జి కూలిపోయిందని రష్యా చెబుతోంది. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునుకు ఆదేశించారు పుతిన్‌.. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌పై దాడులు జరుగుతున్నట్లుగా అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి..

Tags

Read MoreRead Less
Next Story