luiza rozova: రష్యా-ఉక్రెయిన్ వార్.. పుతిన్ కుమార్తెపై ట్రోల్స్..

luiza rozova: ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ముద్దుల తనయపై ట్రోల్స్ చేస్తూ సోషల్ మీడియాలో దాడికి దిగుతున్నారు నెటిజన్లు. దీంతో ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజిని తొలగించింది. పుతిన్ కూతురు 18 ఏళ్ల లూయిజా రోజోవా 5 నెలల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం మానేసింది. ఇప్పుడు ఉక్రెయిన్‌పై పుతిన్ దాడి చేసిన తరువాత భారీ ట్రోలింగ్ కారణంగా ఆమె తన ప్రొఫైల్‌ను పూర్తిగా తొలగించింది.
లూయిజా రోజోవా రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో చదువుకుంటోంది. ఫిబ్రవరి 24న ఉక్రేనియన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి రోజోవా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెకు 84వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అనుచరులు
ఉక్రేనియన్ నగరాల్లో రష్యా సైనిక దాడులను ప్రకటించినప్పటి నుండి అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు వ్లాదిమిర్ పుతిన్. తండ్రి చర్యల కారణంగా ఆమెను అసభ్యంగా దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నారు.
ఇప్పుడు ఆ యువతి అ చర్యలను తట్టుకోలేక తన ప్రొఫైల్‌ను తొలగించింది. ట్రోలర్‌లలో ఒకరు "ఎలుకలా నువ్వు బంకర్‌లో కూర్చున్నావా?" బయట ఏం జరుగుతుందో కొంచెమైనా నీకు తెలుస్తోందా.. మీ నాన్నకు చెప్పొచ్చు కదా యుద్దం ఆమని అని పోస్టులు పెడుతున్నారు.
45 ఏళ్ల లూయిజా రోజోవా తల్లి స్వెత్లానా క్రివోనోగిఖ్ రష్యాలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరు. ప్రస్తుతం దేశంలోని ప్రధాన బ్యాంకుకు ఆమె సహ యజమానిగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com