RUSSIA PRESIDENT PUTIN: 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న పుతిన్..

RUSSIA PRESIDENT PUTIN: ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోమారు తండ్రి కాబోతున్నారు. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్, పుతిన్ ప్రియురాలు అలీనా కబేవా త్వరలోనే ఓ అమ్మాయికి జన్మనివ్వబోతున్నట్టు సమాచారం. పుతిన్ ద్వారా ఇప్పటికే అలీనాకు ఇద్దరు కుమారులు, మరో ఇద్దరు కవల అమ్మాయిలు ఉన్నట్టు తెలుస్తోంది.
పుతిన్ వ్యక్తిగత జీవితం అంతా రహస్యంగానే ఉంటుంది. అందువల్ల వీరి వివరాలు కూడా రహస్యంగా ఉంచారు. అలాగే, మాజీ భార్య లియుద్ మిలాతో పుతిన్‌కు ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరైన మారియా వొరొత్సోవా వ్యాపారవేత్త కాగా,. మరో కుమార్తె కేటెరినా శాస్త్రవేత్తగా ఉన్నారు. అయితే అలీనా ప్రెగ్నెన్సీపై పుతిన్ మాత్రం.. సంతోషంగా లేరని పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల నేపథ్యంలో కబయెవాను సైబీరియన్అండర్ గ్రౌండ్సిటీ బంకర్లో రహస్యంగా ఉంచినట్లు రష్యా మీడియా వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com