Putin-Kim: కిమ్‌కు పుతిన్ కానుకగా 24 గుర్రాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం తరచూ చూస్తుంటాం. గతంలో పంగ్సన్ అనే తెల్లటి వేట జాగిలాలను పుతిన్‌కు కిమ్ కానుకగా ఇవ్వగా.. రష్యా అధ్యక్షుడు ఆరుస్ లిమోసిన్ కారు బహూకరించారు. ఇరువురు దేశాధినేతలు ఈ కారులో కొద్దిసేపు షికారు కూడా చేశారు. తాజాగా పుతిన్ మరోసారి కిమ్‌కు కానుకలు పంపారు. ఈసారి మేలిమి జాతికి చెందిన 24 గుర్రాలను పుతిన్ బహూకరించారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి ఆయుధాలను సరఫరా చేసినందుకు కృతజ్ఞతగా ఈ రిటర్న్‌గిఫ్ట్‌ను పంపినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఓర్లోవ్ ట్రోటర్ జాతికి చెందిన 19 మగ గుర్రాలు (స్టాలియన్లు), అయిదు ఆడ గుర్రాలను రష్యా పంపింది. ఈ జాతి గుర్రాలంటే కిమ్‌కు ఎంతో ఇష్టమట. వీటిని ఉత్తర కొరియా వారసత్వానికి ప్రతీకలుగా భావిస్తారు.
రెండేండ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్ గుర్రాల్ని కిమ్‌కు అందజేయగా, వాటిపై స్వారీ చేస్తూ కిమ్ జోంగ్ ఉన్ తెగ మురిసిపోయారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారని తెలిపింది. కిమ్ ఈ ఏడాది జూన్‌లో పుతిన్‌కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్ ఆగస్టులో కిమ్‌కు 447 మేకల్ని పంపారట.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com