Brazil President: పుతిన్‌ని అరెస్ట్ కానివ్వను..
2024లో రియో జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరైతే ఆయన్ను ఎవరూ అరెస్టు చేయబోరని బ్రెజిల్ అధ్యక్షుడు లూల డసల్వా ప్రకటించారు. జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు హాజరైన ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది బ్రెజిల్‌లో జీ-20 సదస్సు జరగనున్న నేపథ్యంలో పుతిన్‌ను ఆహ్వానించారు. రష్యాలో జరిగే బ్రిక్స్ సమావేశానికి తాను హాజరుకానున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు డసల్వా తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి బలవంతంగా పిల్లలను అపహరించిన నేరానికి సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు....మార్చిలో పుతిన్ అరెస్టుకు వారెంటు జారీ చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏర్పాటు కోసం జరిగిన ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు పుతిన్‌ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే దిల్లీలో జరుగుతున్న జీ-20 సమావేశాలకు పుతిన్‌కు బదులుగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరయ్యారు. అయితే తాను అధ్యక్ష పదవిలో ఉన్నంత వరకు బ్రెజిల్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అరెస్ట్ జరగదని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా చెప్పారు. వచ్చే ఏడాది జీ20 సమావేశాలు బ్రెజిల్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో తమ దేశంలో జరిగే జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరవుతారని, అక్కడ పుతిన్ అరెస్టయ్యే అవకాశమే లేదని ఆయన అన్నారు.
ఉక్రెయిన్ యుద్ధంలో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడని, వందలాది పిల్లలను చట్టవిరుద్ధంగా బహిాష్కరించాడని, యుద్ధనేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు మార్చిలో పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ లో రష్యా బలగాలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాయని, ఉక్రెయిన్ పిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ ఇటీవల కాలంలో దేశం విడిచి ఏ అంతర్జాతీయ సమావేశాలకు హాజరుకావడం లేదు. అయితే ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు(ఐసీసీ) ఏర్పాటుకు దారి తీసిన రోమ్ శాసనంపై బ్రెజిల్ సంతకం చేసింది. ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల్లోకి ఐసీసీ దోషిగా నిర్థారించిన వ్యక్తి వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com