PM Modi: రష్యా – ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి భారత్‌ పూర్తి మద్దతు

PM Modi: రష్యా – ఉక్రెయిన్‌ వివాద పరిష్కారానికి భారత్‌ పూర్తి మద్దతు
ఇరు దేశాధినేతలతో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

భారతదేశంలో జరగనున్న లోక్‌​సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తమ దేశాల్లో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోడీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆహ్వానించారు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం తెలిపారు. కాగా, బుధవారం పుతిన్​, జెలెన్​స్కీతో ప్రధాని మోడీ ఫోన్​లో వేర్వేరుగా మాట్లాడారు. ఆ సమయంలో ఇరువురు అధ్యక్షులు మోడీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఐదోసారి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్‌​కు విషెస్​చెప్పారు మోడీ. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉక్రెయిన్‌-రష్యా సంక్షోభ పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలే మార్గమని స్పష్టం చేశారు

ముందుగా పుతిన్‌తో మాట్లాడిన మోదీ.. ఇటీవలే జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుపొంది అత్యున్నత పదవి చేపట్టినందుకు ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఉక్రెయిన్‌తో వివాద పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన చర్యలే మేలని సూచించినట్లు సదరు వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఇరు దేశాల బంధం మరింత బలపడాలని, కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి.

అదేవిధంగా భారత్-ఉక్రెయిన్ బంధం బలోపేతం చేయడంపై అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మోదీ చర్చించారు. ప్రస్తుతం యుద్ధం ముగింపునకు, శాంతిస్థాపనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. యుద్ధం నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు భారత్ మానవతాసాయం కొనసాగిస్తుందని హామీ ఇచ్చినట్టు తెలిసింది. రష్యా-ఉక్రెయిన్‌ వివాదం వీలైనంత త్వరగా శాంతియుతంగా పరిష్కారం అయ్యేలా జరిగే ప్రయత్నాలకు భారత్‌ పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు, ఉక్రెయిన్‌కు భారత్‌ అందిస్తున్న మానవతా సాయాన్ని జెలెన్‌స్కీ ప్రశంసించారు. వివిధ అంశాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోడీని ఉక్రెయిన్ ఆహ్వానించారు జెలెన్‌స్కీ. కాగా, ఇలా ఒకేరోజు రష్యా, ఉక్రెయిన్‌ అధ్యక్షులతో మోడీ సంభాషించడం విశేషం. ఇది ఇలావుండగా, ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ.. భూటాన్ దేశ పర్యటన వాయిదా పడింది.


Tags

Next Story