Russia:2020లో ట్రంప్‌ గెలిచి ఉంటేనా..

Russia:2020లో ట్రంప్‌ గెలిచి ఉంటేనా..
X
పుతిన్ కీలక వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తెగ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఆయన స్మార్ట్ అంటూ కితాబిచ్చారు. ట్రంప్‌ ఎంతో చురుకైన వ్యక్తి అని, చెప్పిన విషయాలను ఆచరణలో పెడతారని న్నారు. దాతో పాటూ 2020లో ట్రంప్ గెలిచి ఉంటే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చి ఉండేది కాదని...అసలు యుద్ధే మొదలయ్యేది కాదంటూ కీలక వ్యాఖ్యలను చేశారు. ఇప్పటికే ఈ విషయం చాలా సార్లే చెప్పానని...ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని పుతిన్ అన్నారు. గతంలో చాలాసార్లు ట్రంప్‌ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఇదే వాదన చేశారు. తన విజయాన్ని దొంగిలించారని, ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం ఆసక్తికరంగా మారింది.

ఉక్రెయిన్ తో యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ తెలిారు. వాషింగ్టన్ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. అమెరికాతో ఎప్పుడు సంప్రదింపులు జరపుతారనే విషయాన్ని మాత్రం పుతిన్‌ చెప్పలేదు. తాజాగా ట్రంప్‌.. ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి చర్చలకు రాకుంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

మరోవైపు ఎన్నికల ముందు నుంచీ చెప్పినట్టుగానే అధ్యక్షుడు అయ్యాక వరుసగా అన్ని పనులూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ట్రంప్. పదవిలోకి రాక ముందే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఆగేలా చేశారు. అలాగే అక్రమ వలసల మీద కూడా వరుస పెట్టి చర్యలను తీసుకుంటున్నారు. ఇంకా చాలా వాటి మీద దృష్టి పెట్టారు ట్రంప్. అమెరికాను మళ్ళీ పెద్దన్న చేస్తానని మాటిచ్చిన ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. రష్యా, ఉక్రియెన్ యుద్ధాన్ని కూడా నివారించగలిగితే...ట్రంప్ అమెరికా హోదాను పూర్తిగా నిలిపిన వారు అవుతారు.

Tags

Next Story