Qatar Summit: ఖతార్‌లో 50 ముస్లిం దేశాల సమావేశం..

ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయాంలో ఖతార్ రాజధాని దోహాలో సోమవారం నుంచి అరబ్ ఇస్లామిక్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో 50 కి పైగా ముస్లిం దేశాలు పాల్గొనబోతున్నాయి. ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం దేశాలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశం ఇజ్రాయెల్‌ను మాత్రమే కాకుండా, అమెరికాను కూడా కలవరపెడుతుంది.
గాజాలో ఇజ్రాయెల్ చేసిన దానితో ముస్లిం దేశాలు ఇప్పటికే కోపంగా ఉన్నాయి. కానీ ఖతార్‌లో దాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దానికి తోడు ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్‌ను ఇజ్రాయెల్ మందలించిన తీరుపై కూడా ముస్లిం దేశాలకు కోపం తెప్పించినట్లు సమాచారం. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడితో అమెరికాకు మద్దతు ఇచ్చే గల్ఫ్, అరబ్ దేశాలు కూడా ఐక్యంగా ఉండాల్సి వచ్చిందని వినికిడి. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలలో మరింత ఉద్రిక్తతను పెంచింది. ఈ అత్యవసర శిఖరాగ్ర సమావేశం అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) సభ్యులను ఒకచోట చేర్చుతోంది. ఇప్పటికే ఆదివారం విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముసాయిదా తీర్మానం చర్చించినట్లు సమాచారం. అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబుల్ ఘైత్ అషార్క్ అల్-అవ్సత్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సమావేశం ఖతార్ ఒంటరిగా లేదని సందేశం ఇస్తుందని, అరబ్, ఇస్లామిక్ దేశాలు దోహాతో ఉన్నాయని ప్రపంచానికి తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 9 దాడిపై ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టినప్పుడు కూడా… ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెనక్కి తగ్గలేదు. శత్రువు ఎక్కడ దాక్కున్నా వారిపై దాడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ ప్రభుత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నాయకులను వారి దేశం నుంచి బయటకు తీసుకురావాలని లేదా వారిని న్యాయంగా తమ ముందు నిలబెట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఖతార్ అలా చేయకపోతే తామే వారిని శిక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. దాదాపు రెండు ఏళ్లుగా జరుగుతున్న గాజా యుద్ధాన్ని ఖతార్ ఒక పక్క ముగించడానికి ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ శాంతి అవకాశాలను నాశనం చేస్తోందని దోహా ఆరోపించింది.
ప్రముఖ అరబ్ దేశమైన యుఎఇ కూడా దోహాపై ఇజ్రాయెల్ దాడిపై కోపంగా ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఈ అంశంపై ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారిని పిలిపించి మందలించింది. ఖతార్ స్థిరత్వం సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ సహకార మండలి (జిసిసి)లోని అన్ని సభ్య దేశాల భద్రత, స్థిరత్వంలో అంతర్భాగమని యుఎఇ స్పష్టం చేసింది.
అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్
ఇజ్రాయెల్ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడి ఇజ్రాయెల్, అమెరికా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లలేదని ఆయన అన్నారు. ఖతార్ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న మిత్రదేశంగా ట్రంప్ పేర్కొన్నారు. అలాగే హమాస్‌ను నిర్మూలించడం ప్రశంసనీయమైనదని అన్నారు. ఖతార్‌లో నివసిస్తున్న హమాస్ నాయకులను తొలగించడంతో గాజాలో ఇప్పటికీ ఖైదు చేసిన బందీలను విడుదల చేయడానికి ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోతుందని నెతన్యాహు చెప్పారు. అలాగే 2023 అక్టోబర్ 7న హమాస్ దాడులతో ప్రారంభమైన యుద్ధాన్ని ముగించడానికి కూడా మార్గం సుగమం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com