Queen Elizabeth II: మహారాణి మరణం అతడు చెప్పిన డేట్‌లోనే.. ఇప్పుడు కొత్త రాజు కూడా..

ElizebethII: పుట్టుకనైనా ఊహిస్తారు కానీ మరణాన్ని ఎలా ఊహిస్తారు.. చికిత్స అందిస్తున్న వైద్యుడికి కూడా అంతుచిక్కని వ్యవహారం అది. సుదీర్ఘ కాలం దేశాన్ని పాలించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్ II గురువారం సెప్టెంబర్ 8న తనువు చాలిస్తారని లోగన్ స్మిత్ అనే ట్విట్టర్ యూజర్ ముందుగానే ఊహించారు. నిజంగానే ఆయన చెప్పినట్లు అదే డేట్‌లో రాణిగారు కన్నుమూశారు. ఈ ఏడాది జులైలోనే అతడు ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
రాణి మరణించిన మరుక్షణం ఈ ట్వీట్ వైరల్ అయింది. వేల మంది రీట్వీట్ చేశారు. అంతటితో ఊరుకోలేదు.. కొత్తరాజు చార్లెస్ ఇంకా సింహాసనం మీద కూర్చోనే లేదు.. అయన కూడా ఎప్పుడు మరణిస్తారో చెప్పేస్తున్నారు. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అంటున్నారు. ఈ మాట విని బ్రిటన్ వాసులు ఆందోళన చెందుతున్నారు.
లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాకవుతున్నారు కొందరు యూజర్లు.. నువ్వేమైనా దేవుడివా.. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ముందే ఎలా ఊహిస్తావు. ఒకసారి నీ అంచనా కరెక్ట్ అయిందని పదే పదే అలానే జరుగుతుందని అనుకోమాకు అని స్మిత్‌పై విరుచుకు పడుతున్నారు. మరో యూజర్.. స్మిత్ నువ్వు జాగ్రత్త బ్రిటీష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు.
అసలే రాణి మరణంతో శోకసంద్రంలో ఉంటే మళ్లీ ఇలాంటి మాటలేంటి అని రాసుకొచ్చారు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లిస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com