Rahul Gandhi: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ న్యూ లుక్‌..

Rahul Gandhi: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ న్యూ లుక్‌..
Rahul Gandhi: దాదాపు నాలుగు నెలలు, నాలుగు వేల కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi: దాదాపు నాలుగు నెలలు, నాలుగు వేల కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ నాయకుల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చారు రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర పేరుతో పాద యాత్ర నిర్వహించిన రాహుల్ ఆ సమయంలో గన జుట్టును, గడ్డాన్ని అస్సలు కట్ చేయించుకోలేదు. గుబురుగా పెరిగిన గడ్డంతోనే యాత్ర పూర్తి చేశారు. అయితే ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసగించే అవకాశం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన జుట్టును, గడ్డాన్ని కత్తిరించుకుని, సూట్ వేసుకుని న్యూలుక్‌లో దర్శనమిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు ఒక వారం పర్యటన కోసం మంగళవారం లండన్‌లో అడుగుపెట్టారు. ఇందులో తాను చదువుకున్న విద్యాసంస్థ అయిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం ఇవ్వనున్నారు.

కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్ (కేంబ్రిడ్జ్ JBS) విజిటింగ్ ఫెలో అయిన రాహుల్ గాంధీ "లెర్నింగ్ టు లిసన్ ఇన్ 21వ శతాబ్దం" అనే అంశంపై ప్రసంగిస్తారు. కత్తిరించిన జుట్టు, స్టైల్ గడ్డంతో ఉన్న కాంగ్రెస్ ఎంపీ చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరు #NewLook అనే హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగిస్తున్నారు. 52 ఏళ్ల రాహుల్ పాదయాత్రలో 12-రాష్ట్రాలను చుట్టిన సమయంలో జుట్టు, గడ్డం పెంచుకున్నారు.

కేంబ్రిడ్జ్‌లో, రాహుల్ గాంధీ "బిగ్ డేటా అండ్ డెమోక్రసీ" మరియు "ఇండియా-చైనా సంబంధాలు" అనే అంశంపై యూనివర్శిటీ కార్పస్ క్రిస్టీ కాలేజ్ అండ్ కోలో భారతీయ సంతతికి చెందిన ఫెలో, ట్యూటర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ శ్రుతి కపిలాతో క్లోజ్డ్ డోర్ సెషన్‌లను నిర్వహించాలని యోచిస్తున్నారు. "మా @CambridgeMBA కార్యక్రమంలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది" అని కేంబ్రిడ్జ్ JBS ట్వీట్ చేసింది. రాహుల్ ట్వీట్‌‌కు రిప్లై ఇస్తూ.. "CambridgeJBSలో ఉపన్యాసాన్ని అందించడానికి ఎదురుచూస్తున్నాను. భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు వంటి వివిధ అంశాలలో పాలు పంచుకోవడం సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు. రాహుల్ చివరిసారిగా గత ఏడాది మేలో UK పర్యటన సందర్భంగా కార్పస్ క్రిస్టి కాలేజీలో "ఇండియా ఎట్ 75" అనే కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

Tags

Read MoreRead Less
Next Story