Ukraine: అందంగా కనిపిస్తే అత్యాచారం.. అందుకే ఉక్రెయిన్ అమ్మాయిల షాకింగ్ డెసిషన్

Ukraine: అందంగా కనిపిస్తే అత్యాచారం.. అందుకే ఉక్రెయిన్ అమ్మాయిల షాకింగ్ డెసిషన్
Ukraine: కీవ్‌కు వాయువ్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న ఇవాన్‌కివ్, నెల రోజులకు పైగా రష్యా ఆధీనంలో ఉంది.

Ukraine: ఉక్రెయిన్‌లో దారుణాలు చోటుచేసుకుందటున్నాయి. రష్యా దాడులతో ఉక్రెయిన్ శ్మశానాన్ని తలపిస్తోంది. అక్కడి మహిళలపై రష్యా సైనికులు సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని అమ్మాయిలు తమ జుట్టును కత్తిరించుకుంటున్నారు. అందంగా, ఆకర్షణీయంగా కనిపించకూడదనే ఉద్దేశ్యంతో పొడవుగా ఉన్న జుట్టును పొట్టిగా కత్తిరించుకుంటున్నారు.

ఉక్రెయిన్‌లోని ఇవాన్‌కివ్‌లో బాలికలు తమ జుట్టును చిన్నగా కత్తిరించుకున్నారు. తమ పట్టణాన్ని ఆక్రమించుకున్న రష్యా సైనికులు తమపై అత్యాచారం జరపకుండా ఉండేందుకు బాలికలు ఇలా చేస్తున్నారని స్థానిక అధికారులు చెబుతున్నారు. కీవ్‌కు వాయువ్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న ఇవాన్‌కివ్, నెల రోజులకు పైగా రష్యా ఆధీనంలో ఉంది.

మార్చి 30 న, ఉక్రెయిన్ దళాలచే విముక్తి పొందింది. పాంటూన్ వంతెన నిర్మాణం తర్వాత, ఉక్రేనియన్ ఆర్మీ ఇంజనీర్లు ఈ ప్రాంతంపై నియంత్రణను తిరిగి పొందగలిగారు.

అక్కడి మహిళలపై రష్యా బలగాలు దుర్భాషలాడుతున్నాయని నగర డిప్యూటీ మేయర్‌ మెరీనా బెస్చస్ట్నా స్థానిక మీడియాకు తెలిపారు. 15,16 ఏళ్ల బాలికలపై కూడా అత్యాచారాలు చేశారని తెలిపారు. అందుకే అమ్మాయిలు అందంగా కనిపించకూడదనే ఉద్దేశ్యంతో జుట్టును పొట్టిగా కత్తిరించుకోవడం మొదలుపెట్టారని, దీంతో తమవైపు ఎవరూ చూడరని భావించినట్లు మేయర్ వెల్లడించారు.

ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబారి మెలిండా సిమన్స్.. దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియనప్పటికీ రష్యా బలగాలు అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతోందని ట్వీట్ చేశారు. "అత్యాచారం ఒక యుద్ధ ఆయుధం. దాని గురించిన వివరాలు ఉక్రెయిన్‌లో పూర్తిగా అందుబాటులో లేవు. తమ కుటుంబాల ఎదుటే ఆడపిల్లలను లొంగదీసుకుంటున్నారు. అత్యాచారం యుద్ధ నేరం' అని మెలిండా ట్వీట్‌ చేశారు.

ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తోంది.అప్పటి నుంచి ఎంతో మంది సైనికులతో పాటు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గ్రామాల్లో పెద్దఎత్తున శవాలు బయటపడిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారాలపై కూడా భయంకరమైన నివేదికలు అందుతున్నాయి.

కాగా, ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో పలువురు సైనికులు మరణించినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఇది పూడ్చలేని నష్టమని ఆయన అన్నారు. అయినా రష్యా ఉక్రెయిన్‌పై దాడులను ఆపలేదు. దీంతో ఉక్రెయిన్‌లో ఇప్పటికే అనేక విషాద పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమాయక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆత్మీయులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయిన వారు ఎందరో.. యుద్ధం ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఉక్రెయిన్ లో నెలకొన్నపరిణామం.

Tags

Read MoreRead Less
Next Story