Pakistan PM: భారత్‌తో చర్చలకు సిద్ధమే
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ పాకిస్థాన్ ప్రధాని( Pakistan PM) షెహబాజ్ షరీఫ్( Shehbaz Sharif) కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని తీవ్రమైన సమస్యలపై( All Serious Matters) భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు(Ready To Talk To India) ప్రకటించారు. పేదరికం, నిరుద్యోగం(poverty and unemployment)పై పోరాడుతున్న రెండు దేశాలకు యుద్ధం వాంఛనీయం కాదని( war is not an option) పేర్కొన్నారు. యుద్ధాల వల్ల పేదరికం, నిరుద్యోగం పెరిగిందని, విద్య, ఆరోగ్యం, ప్రజాసంక్షేమం వంటి ముఖ్యమైన రంగాలకు ఆర్థిక వనరుల కొరత ఏర్పడిందని పాక్ ప్రధాని అన్నారు.
ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ మినరల్స్ సదస్సు( Pakistan Minerals Summit) ప్రారంభ కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్( Prime Minister Shehbaz Sharif) ప్రసంగించారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌కు విదేశీ పెట్టుబడుల(foreign investment )ను తీసుకురావడమే లక్ష్యంగా 'డస్ట్ టు డెవలప్‌మెంట్'( Dust to Development) నినాదంతో ఈ సదస్సు నిర్వహించారు. పొరుగు దేశంతో సహా అందరితో చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తీవ్రమైన విషయాలను ఇరుగుపొరుగువారు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని. ఎందుకంటే యుద్ధమనేది ఎప్పటికీ ఓ పరిష్కారం కాదని షెహబాజ్ వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ ఎప్పుడూ తమ అంతర్భాగమేనని భారత్ చెప్పిన విషయాన్ని పాక్ ప్రధాని గుర్తు చేశారు. అసాధారణమైన సమస్యలను తొలగించుకోకపోతే అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాక్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకూ ద్వైపాక్షిక సంబంధాలు కష్టమేనని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
మరోవైపు మిత్రపక్షాల సంప్రదింపులతోనే ఆగస్టు 12లోపు జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తామని(National Assembly Will Be Dissolved) షెహబాజ్ షరీఫ్ తెలిపారు. జాతీయ అసెంబ్లీ పదవీకాలం ఆగస్టు 12వతేదీతో ముగుస్తుందని, అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేస్తామని షెహబాజ్ చెప్పారు. (Pakistan PM) ఎన్నికల సంఘం తదుపరి ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని తెలిపారు. నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతతో సంప్రదింపులు జరిపి ఆపద్ధర్మ ప్రధాని గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మే 9 పాకిస్థాన్‌లో జరిగిన హింసాకాండలో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పిటిఐ కార్యకర్తలతో పాటు, రాజకీయ నాయకుల బృందం, కొంతమంది సైనికులు, వారి కుటుంబాలు కూడా పాల్గొన్నాయని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com