Resignation: ఆఫీస్‌‌కి రమ్మంటే రిజైన్ చేస్తామంటున్న ఉద్యోగులు.. ఇప్పటికే 45 లక్షల మంది..

Resignation: ఆఫీస్‌‌కి రమ్మంటే రిజైన్ చేస్తామంటున్న ఉద్యోగులు.. ఇప్పటికే 45 లక్షల మంది..
Resignation: ఆఫీస్‌ పేరు చెబితే చాలు.. రిజైన్ చేసేస్తామంటున్నారు ఐటీ ఉద్యోగులు. కరోనా పుణ్యమా అని అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాయి అనేక సంస్థలు..

Resignation: ఆఫీస్‌ పేరు చెబితే చాలు.. రిజైన్ చేసేస్తామంటున్నారు ఐటీ ఉద్యోగులు. కరోనా పుణ్యమా అని అందరికీ వర్క్ ఫ్రమ్ కల్పించాయి అనేక సంస్థలు.. ఇంటి నుంచి పని చేస్తున్నా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు అన్నీ సమయానికి కంప్లీట్ చేస్తున్నారు.. ఇంట్లో భార్యా పిల్లలకు సమయాన్ని కేటాయిస్తున్నారు.. మరింక ఆఫీస్‌కి ఎందుకు రావాలని ప్రశ్నిస్తున్నారు.. గట్టిగా మాట్లాడితే రిజైన్ చేస్తామంటున్నారు అమెరికాకు చెందిన ఐటీ ఉద్యోగులు.

కరోనా తర్వాత ఉద్యోగుల రాజీనామాలు ప్రపంచమంతటా పెరుగుతూనే ఉన్నా అమెరికాలో మాత్రం చిన్న కంపెనీలకు ఇది మరీ ఎఫెక్ట్ ఇస్తుంది. గత ఏడాది 4.7 కోట్ల మంది తమ ఉద్యోగాలకు రిజైన్ చేసినట్లు బ్యూరో ఆఫ్ లేబర్ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే ఏకంగా 45 లక్షల మంది ఉద్యోగాలు మానేశారట. వీళ్లంతా తమకు నచ్చిన వేళల్లో పని చేసే వెసులు బాటు ఉన్న ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. ఒకరకంగా ఉద్యోగుల్లో ధీమా పెరిగింది. ఉన్న ఉద్యోగం మానేసినా నచ్చిన పని వెదుక్కోవడం కష్టం కాదన్న భావన పెరిగింది అని స్టాన్‌ఫర్డ్ వర్శిటీ ప్రొఫెసర్ నికోలస్ బ్లమ్ అన్నారు.

మన దేశంలోనూ అదే ధోరణి కనబడుతోంది.. ఐటీ, టెలికాం రంగాల్లో ఉన్న 86 శాతం మంది ఉద్యోగులు ఉద్యోగం మారాలనుకుంటున్నట్లు తెలిపారు. 2022 మార్చి త్రైమాసికంలో టీసీఎస్ కంపెనీలో 17.4 శాతం, హెచ్‌సీఎల్‌లో 21.9 శాతం, విప్రోలో 27.2 శాతం మంది ఉద్యోగులు రిజైన్ చేశారు.

సర్వే ప్రకారం..

ప్రతి ఐదుగురిలో ఒకరు ఉద్యోగం మారాలనుకుంటున్నవారు కొందరైతే, ఆధిక జీతం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్న వారు మరికొందరు. 44 శాతం మంది వృత్తి, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల జాబ్ మారుతున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 29 శాతం మంది మాత్రమే చేస్తున్న ఉద్యోగాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు.

ఇదిలా ఉంటే రాజీనామాల నేపథ్యంలో కంపెనీలను ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తవారిని రిక్రూట్ చేసే పనిలో పడ్డాయి కొన్ని కంపెనీలు.. అమెజాన్, గూగుల్ వంటి పెద్ద పంప్థలు కూడా అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. పని విధానాన్ని మార్చేస్తున్నాయి. అధిక జీతం ఎరగా వేస్తూ కనీసం రెండు రోజులు అయినా ఆఫీస్‌కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాయి. జర్మనీకి చెందిన ఇన్సూరెన్స్ కంపెనీ డాబే అయితే ఇంటర్వ్యూకి హాజరైన అభ్యర్థులకు కూడా బహుమతులు అందిస్తోంది. తమ కంపెనీలో జాయిన్ అయితే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని వాగ్ధానం చేస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story