Reham Khan : ఇమ్రాన్‌ఖాన్ పరువు తీసేసిన అయన మాజీ భార్య

పాకిస్థాన్‌లో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. పాక్ ప్రధాన మంత్రి ఐన ఇమ్రాన్‌ఖాన్ ప్రస్తుతం అవిశ్వాస తీర్మానాన్ని ఎదురుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మాజీ భార్య, పాత్రికేయురాలు రెహమ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇమ్రాన్ ఇప్పుడో గత చరిత్ర అని అమె అభిప్రాయపడ్డారు.. నయా పాకిస్థాన్ పేరుతో పేర్చిన చెత్తను శుభ్రం చేయాలని, దీని కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆమె అన్నారు.
ఇమ్రాన్‌కు సామర్థ్యం, తెలివి లేదని రెహమ్ ఖాన్ విమర్శించారు.. ఇమ్రాన్ ప్రధానిగా లేనప్పుడు పాకిస్తాన్ చాలా గొప్పదని అమె కామెంట్స్ చేశారు. కాగా ఇమ్రాన్‌ఖాన్ కి రెహమ్ ఖాన్ రెండో భార్య కాగా ఆమెను 2015 జనవరిలో వివాహం చేసుకున్నాడు.. అయితే తొమ్మిది నెలలకే వీరి వివాహంబంధం తెగిపోయింది.
ఇక ఇమ్రాన్ ఖాన్ 995లో బ్రిటన్ బిలియనీర్ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్ వివాహం చేసుకొని తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయాడు. ఇమ్రాన్ 2018 ఫిబ్రవరిలో మతగురువైన బుష్రా మనేకాను వివాహం చేసుకున్నాడు.. మూడు నెలల తర్వాత ఆమెతో కూడా విడిపోయాడు.
కాగా ఇమ్రాన్‌ను ఆమె విమర్శించడం ఇదేం తొలిసారి కాదు. ఇమ్రాన్ పరిపాలన తీరుపై గతంలో కూడా పలుమార్లు విమర్శలు గుప్పించారు రెహమ్ ఖాన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com