Israel-Hamas War: ఇద్దరు అమెరికన్ బంధీలను విడిచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు

Israel-Hamas War: ఇద్దరు అమెరికన్ బంధీలను విడిచిపెట్టిన  హమాస్ ఉగ్రవాదులు
ఆరోగ్యం క్షీణించడంతో తల్లి,కూతురిని వదిలిపెట్టిన ఉగ్రవాదులు

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమాయక ప్రజలు బలైపోతున్నారు. అయితే ఓ పక్క ఇజ్రాయెల్‌లో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాదులు కాస్తంత దయచూపారు. భీకర దాడుల సమయంలో బంధీలుగా మార్చుకున్న దాదాపు 200 మందిలో ఇద్దరు అమెరికన్లను వదిలిపెట్టారు. జుడిత్ తై రనన్, ఆమె కూతురు 17 ఏళ్ల నటాలి రనన్‌ను విడిచిపెట్టారు. తల్లి జుడిత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో హమాస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖతార్ చొరవ ఫలితంగా హమాస్ సాయుధ విభాగం ‘అల్-క్వాస్సామ్ బ్రిగేడ్స్’ ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో వారిద్దరిని విడిచిపెట్టినట్టు టెలిగ్రామ్ వేదికగా హమాస్ వెల్లడించింది.

దీనితో US అధ్యక్షుడు జో బైడెన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆనంతరం బైడెన్ విడుదలైన ఇద్దరు మహిళలతో ఫోన్‌లో మాట్లాడారు. విడుదలైన ఇద్దరు మహిళలు జుడిత్ తై రానన్ మరియు ఆమె కుమార్తె నటాలీ శోషనా రానన్ గా అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ప్రస్తుతం విడుదలైన తల్లి కూతురు గాజా సరిహద్దులో ఒక ఇజ్రాయెల్ రాయబారిని కలుసుకున్నారు. కాగా సెంట్రల్ ఇజ్రాయెల్‌ లోని సైనిక స్థావరాల వద్ద వారిని కలవడానికి కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. కాగా ఖతార్ మరియు ఈజిప్ట్‌లు సంప్రదించిన తరువాత, (ఎజ్జెడిన్) అల్-కస్సామ్ బ్రిగేడ్‌లు మానవతా దృఖ్పధంతో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశాయి అని హమాస్ తెలిపింది.


యుద్ధం నేపధ్యంలో ఇరు దేశాలలో ప్రజలు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. అక్టోబరు 7న హమాస్ చిన్నపెద్ద తేడా లేకుండా విచక్షణ రహితంగా ఇజ్రాయిల్ పైన విరుచుకుపడింది. హమాస్ హింసాత్మక దాడుల్లో మొత్తం ఇరు వైపులా కలిపి 4 వేల మంది మృతి చెందారు . 1400 మంది పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. 200 మందిని అపహరించి తన అధీనంలో బంధించింది. హమాస్ ఉగ్రవాదులు అపహరించి బంధించిన 200 మందిలో ఇద్దరు అమెరికన్లు కూడా ఉన్నారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారిలో 20 మందికిపైగా మైనర్లు, 10 నుంచి 20 మంది 60 ఏళ్లు నిండిన వృద్ధులు ఉన్నారని ఇజ్రాయెల్ లెక్కగట్టింది.

కాగా హమాస్ ఉగ్రవాదులు బంధీలుగా మార్చుకున్నవారిలో అత్యధికులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే గాజా‌స్ట్రిప్‌కు తీసుకెళ్లినవారిలో కొందరు చనిపోయారని విచారం వ్యక్తం చేసింది. ఇక బంధీలుగా ఉన్నవారిలో మైనర్ల సంఖ్య 20 దాకా, 10-20 సంవత్సరాల వయసున్నవారు దాదాపు 60 మంది వరకు ఉండొచ్చని . ఇక హమాస్ దాడుల తర్వాత 100-200 మంది తప్పిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story