ప్రధానిగా 16 ఏళ్ల బాలిక.. ఎక్కడో తెలుసా!!

దేశానికి ప్రధానిగా ఉండే అవకాశం, అదృష్టం ఓ 16 ఏళ్ల అమ్మాయి సొంతం చేసుకుంది. దక్షిణ ఫిన్లాండ్‌లోని వాస్కీకి చెందిన ఆవా ముర్టో. ఒక రోజు ప్రధాని బాధ్యత స్వీకరించిన ఆ అమ్మాయి ఛాన్సలర్‌తో సమావేశమైన తర్వాత పార్లమెంటు మెట్లపై మీడియాతో మాట్లాడింది. ప్రధానిగా ఒక్క రోజే ఆ బాధ్యత స్వీకరించినా చట్టం గురించి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను" అని చెప్పింది. మానవ హక్కులకు సంబంధించిన ప్రచారాలలో కూడా పాల్గొంది.
అమ్మాయిలకు ఆమె ఇచ్చిన సందేశం.. టెక్నాలజీలో ముందుకు పోవలసిన ప్రాముఖ్యత గురించి వివరించింది. యువత వినూత్నంగా ఉండాలని, భవిష్యత్తు గురించి మరింత ఆలోచించమని చెప్పింది. ఫిన్లాండ్ ప్రధానిగా డిసెంబరులో పదవీ బాధ్యతలు స్వీకరించిన 34 ఏళ్ల సనా మారిన్ ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలైన ప్రభుత్వ అధిపతి. మహిళలచే నాయకత్వం వహించిన ఐదు కేంద్ర పార్టీల కూటమికి నాయకత్వం వహిస్తున్నారు.
ఒక్క రోజు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ముర్టోతో అసలు ప్రధాని సనా అల్పాహారం చేయాలనుకున్నారు. కానీ అది చివరి నిమిషంలో రద్దయింది. సాయింత్రం వారిద్దరూ ముచ్చటించుకున్నారు. రాబోయే సంవత్సరాల్లో పూర్తి సమయం ఇలాంటి బాధ్యతలు నిర్వర్తించడానికి ఆసక్తి ఉందా అని అడిగినప్పుడు ముర్టో "అవకాశం వచ్చినప్పుడు తప్పక ఆలోచిస్తానని ప్రధానికి చెప్పింది.ముర్టోకి ఒక్క రోజు ప్రధాని అవకాశం ఎలా వచ్చిందంటే..
ఈనెల 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం. దాన్ని పురస్కరించుకుని ఐరాస బుధవారం గర్ల్స్ టేకోవర్ కార్యక్రమాన్ని నిర్వహించింది అక్కడి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ముర్టో ఒక్క రోజు ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.స్త్రీ పురుష సమానత్వ భావనను చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిన్లాండ్‌లోని చాలా సంస్థలు మహిళా సిబ్బందికి ఒక్కరోజు సారథ్య బాధ్యతలు అప్పగించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com