Nepal: నేపాల్ నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు..కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
నేపాల్ లో కొండచరియలు విరిగిపడడంతో.. రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ఉన్న సుమారు 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. వారి కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హిమాలయ దేశం నేపాల్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రెండు బస్సుల్లో మొత్తం 54 మంది ప్యాసింజెర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రోడ్డు మార్గంలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి.
నేపాలీ ఆర్మీ, నేపాల్ పోలీస్, గత ఈతగాళ్లు.. సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. బిర్‌గుంజ్ నుంచి కాఠ్మాండుకు వెళ్తున్న బస్సులో 24 మంది ఉన్నారు. దాంట్లో ఏడుగురు భారతీయులు ఉన్నారు. ఇక కాఠ్మాండు నుంచి గౌర్ వెళ్తున్న బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 500 మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. శుక్రవారం రాత్రి గాలింపు చర్యల్ని నిలిపివేశారు. నది ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా సెర్చ్ ఆపరేషన్ ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. ఇంకా సెర్చ్ కొనసాగుతూనే ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com