Mahatma Gandhi : మహాత్మాగాంధీకి కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారం..!

Mahatma Gandhi : మహాత్మా గాంధీని ప్రతిష్ఠాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారంతో గౌరవించుకోవాలని అమెరికా ప్రతినిధులు తీర్మానించారు. న్యూయార్క్ప్రజాప్రతినిధి కరోలిన్ ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచగా సభ్యులు ఆమోదం తెలిపారు. కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌ను అమెరికాలోనే అత్యున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తారు. నెల్సన్ మండేలా, ఆంగ్‌సాంగ్ సూకీ సహా పలువురికి ఈ మెడల్ అందించారు. అయితే, మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ కానున్నారు.
మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన చూపిన అహింస మార్గాలు.. దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు అమెరికా ప్రజాప్రతినిధులు. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి గాంధీ ఓ ఉదాహరణ అని కొనియాడారు. ప్రపంచానికి శాంతి, అహింస మార్గాలు చూపి.. మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ కోరారు. దీంతో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో గాంధీని గౌరవించుకోవాలని ప్రతినిధుల సభ మరోసారి తీర్మానించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com