Iran Parliament: ఒక డాలరుకు 10 లక్షల రియాల్స్

ఇరాన్ కరెన్సీ అయిన ‘రియాల్’ విలువ దారుణంగా పడిపోవడంతో, ఇందుకు బాధ్యుడిని చేస్తూ దేశ ఆర్థిక మంత్రిని పార్లమెంటు తొలగించింది. ఆర్థిక మంత్రి అబ్దోల్ నస్సెర్ హెమ్మతిని అభిశంసిస్తూ ఆదివారం తీర్మానం చేసింది. ఒక అమెరికా డాలరు పొందడానికి 9,30,000 రియాల్స్ చెల్లించాల్సి వచ్చేలా కరెన్సీ విలువ పతనమయింది. 2015లో డాలరుతో మారకం విలువ 32,000 రియాల్స్‌గా ఉండేది. గత ఏడాది జులైలో అధ్యక్షుడిగా మసౌద్ పెజెక్షియాన్ బాధ్యతలు చేపట్టేనాటికి దాని విలువ 5,84,000 రియాల్స్‌కు పడిపోయింది. గత ఆరు నెలలుగా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అస్తవ్యస్థంగా మారడంతో రియాల్ విలువ దారుణంగా దిగజారింది. ఇప్పుడు ఒక్క డాలరు కోసం దాదాపు 10 లక్షల రియాల్స్ చెల్లించాల్సిన పరిస్థితి రావడంతో పార్లమెంటు ఆర్థిక మంత్రిపై చర్యలు తీసుకొంది. 2015లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, పశ్చిమ దేశాలు ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పరిస్థితులు ఘోరంగా మారాయి.
ఆంక్షల యుద్ధంలో చిక్కుకున్నామని, అందరూ సహకరించాలని అధ్యక్షుడు పెజెక్షియన్ కోరినప్పటికీ పార్లమెంటు మాత్రం ఆర్థిక మంత్రిని తొలగించింది. కాగా, ప్రపంచంలో అతి తక్కువ విలువ ఉన్న కరెన్సీల్లో ఇరాన్ రియాల్ మూడో స్థానంలో ఉందని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ వర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ స్టీవ్ హంకే తెలిపారు.అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గతేడాది జులైలో బాధ్యతలు చేపట్టినప్పుడు డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ 5,84,000గా ఉండేది. అయితే, గత ఆరు నెలల్లో ఆర్థిక వ్యవహారాలపై దేశం నియంత్రణ కోల్పోవడంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం ఒక్క డాలర్ కోసం దాదాపు 10 లక్షల రియాళ్లు చెల్లించాల్సి వస్తోంది.
2015 అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం, పశ్చిమ దేశాల ఆంక్షలతో ఇరాన్ విలవిల్లాడుతోంది. ప్రపంచంలో అతి తక్కువ విలువ ఉన్న కరెన్సీల్లో ఇరాన్ రియల్ మూడో స్థానంలో ఉంది. కాగా, నేటి ఆర్థిక పరిస్థితికి ఏ ఒక్క వ్యక్తినో నిందించడం సరికాదని, ఒక్క వ్యక్తిపైకి దానిని తోసివేయలేమంటూ ఆర్థిక మంత్రి అబ్దోల్‌నాసెర్ హెమ్మతిని అధ్యక్షుడు మసౌద్ వెనకేసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com