Ireland: ఐర్లాండ్‌లో అల్లరి మూకల విధ్వంసం..

Ireland: ఐర్లాండ్‌లో అల్లరి మూకల విధ్వంసం..
తగలబడుతున్న బస్సులు..

ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు గాయపడటంతో వందలాది మంది ఆందోళన చేపట్టారు. అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. డబ్లిన్‌లోని సిటీ సెంటర్‌ ప్రాథమిక పాఠశాల వద్ద గురువారం మధ్యాహ్నం ఓ దుండగుడు ఐదుగురిపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వారిలో ఐదేళ్ల చిన్నారి, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, దుండగుడు విదేశీయుడంటూ సోషల్‌మీడియాలో పలువురు పెట్టిన పోస్టులు వైరలయ్యాయి. దీంతో దాడిని ఖండిస్తూ భారీ సంఖ్యలో ప్రజలు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళనకు దిగారు. ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళనకు దిగారని పోలీసులు తెలిపారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన శిక్షణలుంటాయని హెచ్చరించారు. దుండగుడి కోసం నగరంమంతా గాలిస్తున్నామని వెల్లడించారు. ఘటనపై ఐర్లాండ్‌ ప్రధాన మంత్రి లియో వరాడ్కర్‌ స్పందించారు. దాడి వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు.

గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు (స్థానిక కాలమానం) నగరంలోని పార్ణెల్‌ స్క్వేయర్‌లోని ప్రాథమిక పాఠశాల వద్ద ఓ దుండగుడు ఐదుగురిపై కత్తితో దాడికిపాల్పడ్డాడు. వారిలో ఐదేండ్ల చిన్నారి సహా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే దాడికి పాల్పడింది విదేశీయుడంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరగడంతో దాడికి నిరసనగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. కార్లు, బస్సులకు నిప్పుపెట్టారు. పలు దుకాణాలను కొల్లగొట్టారు. వలసదారులు ఉన్న ప్రాంతాల్లో ఐర్లాండ్‌ జెండాలు పట్టుకొని వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story