China: మనుషులతో రోబోల పరుగు పోటీ

తెలివితేటలు, శక్తిసామర్థ్యాలు తదితర అంశాల్లో మనుషులతో రోబోలు పోటీపడే రోజు మరెంతో దూరం లేదని చైనాలో నిర్వహించిన పరుగు పందెం వెల్లడించింది. ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబోల మారథాన్ శనివారం బీజింగ్‌లోని ఎకనామిక్-టెక్నాలజికల్ డెవలప్‌మెంట్ ఏరియాలో జరిగింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ తమ కృత్రిమ మేధ సాంకేతిక పురోభివృద్ధిని చాటేందుకు డ్రాగన్ ఈ పోటీల వేదికను వినియోగించుకుంది. 21 కి.మీ.దూరం కొనసాగిన మారథాన్‌లో ట్రాక్‌పై 21 రోబోలు...క్రీడాకారులతో తలపడ్డాయి. విభిన్న ఆకృతులతో పాటు వివిధ పరిమాణాల్లో ఇవి ఉన్నాయి. మనుషులతో పోటీ పడుతూ పరిగెత్తుతున్న రోబోలను ఔత్సాహికులు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉత్తమ డిజైన్, ఉత్తమ సృజనాత్మకత, అత్యధిక సామర్థ్యం, వేగం, తదితర అంశాల్లో రోబోలకు అవార్డులు అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com