Trump: . నేను అడ్డుకోకపోతే ఏం జరిగేదంటే ! ట్రంప్ నోట మళ్లీ అదే మాట..

Trump: . నేను అడ్డుకోకపోతే ఏం జరిగేదంటే ! ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
X
తాను లేకుంటే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి అంటూ మళ్ళీ మొదలు పెట్టిన అమెరికా అధ్యక్షుడు

భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్లీ ట్రంప్ ప్రకటించారు. స్కాట్లాండ్‌లో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని లేవనెత్తారు. తన జోక్యంతోనే ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగిందని.. లేదంటే ఇప్పటికీ రెండు దేశాలు యుద్ధాలు చేసుకునేవని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే సోమవారం పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కేంద్ర పెద్దలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యాన్ని తోసిపుచ్చాయి. మూడోవ్యక్తి ప్రమేయం లేదని.. ఇరుదేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తేల్చి చెప్పారు. కానీ తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. తానే యుద్ధాన్ని ఆపినట్లుగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను ఆపివేసినట్లు చెప్పుకొచ్చారు.

‘‘భారత్-పాకిస్థాన్ ఘర్షణ చాలా పెద్దది. రెండు దేశాలు అణ్వస్త్ర దేశాలు. అణ్వాయుధాలు ప్రయోగించుకుంటే దారుణ పరిస్థితులు నెలకొనేవి. ఇరుదేశాల నేతలు నాకు బాగా తెలుసు. యుద్ధం చేసుకోవాలనుకుంటే.. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనని చెప్పాను. బెదిరించడంతోనే కాల్పుల విరమణ చేసుకున్నాయి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశం-పాకిస్థాన్ మధ్య సహా ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రధాన యుద్ధాలను నిరోధించినట్లు తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. మతం పేరుతో 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. భార్య, పిల్లల ఎదుటే భర్తలను చంపేశారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం భారత ప్రభుత్వం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. వంద మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసింది. ఇక పహల్గామ్ ఉగ్రవాదుల కోసం సైన్యం ఎప్పటి నుంచి వేటాడుతోంది. అనూహ్యంగా సోమవారం పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలో ఉగ్రవాదుల్ని ఆశ్చర్యంగా సైన్యం హతమార్చింది.

Tags

Next Story