హీల్స్ తో పరుగెత్తి స్పెయిన్ వ్యక్తి గిన్నిస్ రికార్డ్

హీల్స్ తో పరుగెత్తి స్పెయిన్ వ్యక్తి గిన్నిస్ రికార్డ్
X
12.82 సెకన్ల‌లోనే 100 మీట‌ర్ల ప‌రుగు

రన్నింగ్ రెస్ అంటే మనకి షూ వేసుకు పరిగెట్టడం తెలుసు. మంచి హిల్స్ వేసుకొని పార్టీకి వెళ్లడం తెలుసు. ఈ రెండింటిని మిక్స్ చేశాడు ఒక వ్యక్తి. అలా చేసి ఓ రికార్డ్ కూడా బ్రేక్ చేసాడు. హైహీల్స్ వేసుకుంటే నడవడమే కాస్త కష్టమవుతుంది. బాగా అలవాటు పడితే ఓకే గానీ లేకుంటే పాదాలు, కాళ్లు, నడుం, తుంటి భాగం నొప్పి చేసేస్తాయి. అమ్మాయిలు తమ హైట్ ని కవర్ చేసుకోవడానికి, స్టైల్ కోసం హీల్స్ వేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి హైహీల్స్ వేసుకుని 100 మీటర్ల పరుగులో వరల్డ్ రికార్డు బద్దలు కొట్టాడు. చిరుత‌లా ప‌రుగు తీశాడు, విజేతగా నిలిచాడు.

రికార్డులు బ్రేక్ చేయ‌డ‌మంటే స్పెయిన్ కు చెందిన క్రిస్టియన్ రబర్టో లోపెజ్ రోడ్రిగ్వెజ్ కు మ‌హా స‌ర‌దా. ఇప్ప‌టికే అత‌డి పేరు మీద 12 రికార్డులు ఉన్నాయి. కొత్త రికార్డుపై క‌న్నేసిన అత‌ను ఈసారి వెరైటీగా ఆలోచించాడు. హై హీల్స్‌తో ప‌రుగెత్తి వేగంగా 100 మీట‌ర్ల ప‌రుగు పూర్తి చేశాడు. క్రిస్టియ‌న్ 12.82 సెకన్ల‌లోనే గమ్య‌స్థానానికి చేరాడు.

34 ఏళ్ల రోడ్రిగ్వెజ్ 100 మీటర్ల పరుగును 12.82 సెకన్లలో పూర్తి చేశాడు. గతంలో హైహీల్స్ వేసుకుని అత్యంత తక్కువ సమయంలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసిన రికార్డు, జర్మనీకి చెందిన వ్యక్తి ఖాతాలో ఉంది. ఆ వ్యక్తి 14.02 సెకన్లలో పూర్తి చేయగా, ఇప్పుడు ఈ స్పెయిన్ వీరుడు రోడ్రిగ్వెజ్ అంతకంటే తక్కువ సమయంలోనే రేస్ ఫినిష్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు.

అదే క్రమంలో రోడ్రిగ్వెజ్ నమోదు చేసిన సమయంలో ప్రఖ్యాత స్ప్రింట్ వీరుడు ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డు టైమింగ్ కు 3.24 సెకన్ల దూరంలో నిలిచాడు. బోల్ట్ 100 మీటర్ల పరుగును 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది.

రోడ్రిగ్వెజ్ టైప్ వన్ డయాబెటిక్. సాధారణ అనారోగ్యం ఉన్న వారితో పోలిస్తే తము బాగానే ఉంటామని, తలచుకుంటే వారి కంటే గొప్ప విషయాలు సాధించగలమని తెలిపేందుకే తాను ఈ రేసుని ఎంచుకున్నాను అన్నాడు. అయితే దీనికి ప్రిపరేషన్ మాత్రం అంత సులువు కాదని చెప్పాడు. రోడ్రిగ్వెజ్ కళ్ళకి గంతలు కట్టుకుని పరుగెట్టడం, వెనక్కి పరిగెత్తడం, టేబుల్ టెన్నిస్ బాల్ ని బాట్ మీద బాలన్స్ చేస్తూ పరిగెత్తడం వంటి 12 రికార్డులు ఇప్పటికీ క్రియేట్ చేసాడు.

Tags

Next Story