సొంత నగరంపైనే బాంబులు వేసుకున్న రష్యా

సొంత నగరంపైనే బాంబులు వేసుకున్న రష్యా
స్థానిక నివేదికల ప్రకారం, రష్యా జెట్ గురువారం రాత్రి రష్యా నగరంపై బాంబు దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నివాసితులను అత్యవసరంగా అక్కడి నుంచి తరలించారు.

స్థానిక నివేదికల ప్రకారం, రష్యా జెట్ గురువారం రాత్రి రష్యా నగరంపై బాంబు దాడి చేయడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నివాసితులను అత్యవసరంగా అక్కడి నుంచి తరలించారు.ఉక్రెయిన్‌తో సరిహద్దుకు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న బెల్గోరోడ్‌లో పేలుడు సంభవించింది అని రష్యా వార్తా సంస్థ TASS నివేదించింది.అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కానీ బెల్గోరోడ్ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ దీనిని వ్యతిరేకించారు. తీవ్ర గాయాలతో ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. "దేవునికి ధన్యవాదాలు, మరణాలు సంభవించలేదు'' అని గ్లాడ్కోవ్ ఊపిరి పీల్చుకున్నారు.

బెల్గోరోడ్‌లో "అత్యవసర పరిస్థితి" ఉందని గవర్నర్ చెప్పారు, పేలుడు కారణంగా నగరం మధ్యలో ఉన్న ఒక కూడలిలో 65 అడుగుల వెడల్పు గల బిలం ఏర్పడింది. అలాగే అపార్ట్‌మెంట్ భవనం, పార్క్ చేసిన కార్లు, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని గ్లాడ్‌కోవ్ తెలిపారు.ఈ పేలుడులో ఏ రకమైన మందుగుండు సామాగ్రి చేర్చారో అధికారులు వెల్లడించలేదు. నవంబర్‌లో, ఉక్రెయిన్‌పై యుద్ధంలో ప్రయోగించడానికి Su-34 బాంబర్‌ల "కొత్త బ్యాచ్" పంపిణీ చేయబడిందని, బాంబింగ్ మిషన్ వీటి పనితీరు గురించి మాట్లాడిందని రష్యన్ స్టేట్ మీడియా నివేదించింది. "అప్‌గ్రేడ్ చేయబడిన Su-34 యుద్ధవిమానం.. అధునాతన వాయు-ప్రయోగ మందుగుండు సామగ్రిని ఉపయోగించుకోవడానికి, నావికా లక్ష్యాలను దెబ్బకొట్టడానికి వీలు కల్పిస్తుంది." అని నివేదికలు పేర్కొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story