Russia: ఇకపై లింగమార్పిడి నిషేధం
రష్యా కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. లింగ మార్పిడి సర్జరీలు, చికిత్సపై నిషేధం విధించింది. సెక్స్ చేంజ్‌ను బ్యాన్ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై దేశాధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా ట్రాన్స్‌జెండర్గా మారాలనుకొనేవారికి ఇది వర్తిస్తుంది.
ట్రాన్స్‌జెండర్ పరిశ్రమ కట్టడి కోసం పుతిన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఏదైనా సీరియస్ మెడికల్ కేసులు తప్పితే మరే కేసుల్లోనూ లింగ మార్పిడిని అంగీకరించేదిలేదని ఈ కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. అయితే పుట్టుకతో సమస్యలు ఉన్నవారికి ఈ చట్టం వర్తించదు. సర్జరీలకు కూడా లైసెన్సు పొందిన క్లినిక్‌లకు మాత్రమే అనుమతి ఇస్తాయని రష్యా ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే ఐడీలపైన కానీ, ఇతర డాక్యుమెంట్లపై కానీ .. ప్రజలు తమ లింగాన్ని ఫ్రీగా మార్చుకోరాదని కొత్త బిల్లులో సూచించారు. గతంలో పెళ్లి చేసుకున్న జంట సెక్స్ చేంజ్ చేయించుకుంటే, వాళ్ల పెళ్లిని రద్దు చేయనున్నారు. 2018 నుంచి 2022 వరకు రష్యాలో సుమారు రెండు వేల మంది లింగ మార్పిడి చేసుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ చట్టం దేశంలో కుటుంబ విలువలను పెంచుతుందని భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com