Russia Earthquake: రష్యాలో భారీ భూకంపం.. కొన్ని గంటల్లోనే టిబెట్‌లో కూడా 4.3 తీవ్రతతో..

రష్యాతో పాటు అనేక ఇతర దేశాలను 8.8 తీవ్రతతో కుదిపేసిన భారీ భూకంపం తర్వాత టిబెట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ప్రకృతి వైపరీత్యాల్లో భాగంగా వర్షాలు, వరదలు, భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ మధ్య తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉన్నపళంగా భవనాలు కుప్పకూలుతున్నాయి. పరిమితంగా ప్రాణనష్టం, భారీగా ఆస్థినష్టం సంభవిస్తోంది.
భూకంప పర్యవేక్షణ సంస్థ ప్రకటన ప్రకారం, టిబెట్ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది , దీని వలన అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంది.
రష్యాలో భారీ ప్రకంపనలు సంభవించాయి. జపాన్‌తో సహా అనేక చోట్ల ప్రకంపనలు సంభవించిన వెంటనే, టిబెట్‌లో ఈరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 6:58 గంటలకు భూకంపం సంభవించింది.
మూడు రోజుల్లో రెండో భూకంపం
టిబెట్‌లో మూడు రోజుల క్రితమే భూకంపం సంభవించింది. వారంలోనే ఇది రెండోసారి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com