Russia-Ukraine war: రష్యా స్వాధీనంలోకి మరో ఉక్రెయిన్ పట్టణం

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మొదలుపెట్టి త్వరలో రెండేళ్లు పూర్తవుతున్న వేళ రష్యా మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. 4 నెలల భీకర పోరు తర్వాత తూర్పు ఉక్రెయిన్‌లోని అవ్‌దివ్కా నగరాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడి నగర పరిపాలన భవనంపై తమ జాతీయ జెండా రష్యా సైన్యం ఎగరవేసింది. నాలుగు నెలలుగా అవ్‌దివ్కాలో పోరాడిన ఉక్రెయిన్ సైన్యం వెనక్కు మళ్లడంతో అవ్‌దివ్కాని మాస్కో సైన్యం స్వాధీనపర్చుకుంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మాస్కో సేనలు కీలక నగరాన్ని సొంతం చేసుకున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి దాదాపు 2 ఏళ్లు పూర్తైన సందర్భంగా తూర్పు ఉక్రెయిన్‌లో కీలకమైన అవ్‌దివ్కా నగరాన్ని రష్యా సైన్యం స్వాధీనపరుచుకుంది. అవ్‌దివ్కా పరిపాలన భవనంపై రష్యా జాతీయ జెండాను ఎగరవేస్తున్న దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పంచుకుంది. నెలల తరబడి ఇరు దేశాల పోరాటానికి అవ్‌దివ్కా కేంద్రంగా నిలిచింది. ఆ ప్రాంతంలో 4 నెలలుగా మాస్కో సైన్యంతో పోరాడిన ఉక్రెయిన్ సేనలు వెనక్కి తగ్గాయి. పుతిన్ సేనలు చుట్టుముట్టడంతో తమ సైనికుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని సైన్యం ఉపసంహరణ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీచీఫ్ తెలిపారు. అయినా కొంత మంది కీవ్ సైనికులను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుందన్నారు.
అవ్‌దివ్కా పరిపాలన భవనంపై రష్యా జాతీయ జెండాఉక్రెయిన్ సైన్యం తీవ్రమైన ఆయుధ సంపత్తి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొటోందని, అవ్‌దివ్కా నుంచి వెనక్కి తగ్గడానికి అదే ప్రధాన కారణంగా ఉక్రెయిన్ సైన్యాధికారి తెలిపారు. రష్యా రక్షణ మంత్రి మాట్లాడుతూ...అవ్‌దివ్కా నగరంలోని కోక్, కెమికల్ ఫ్యాక్టరీల్లో ఉన్న ఉక్రెయిన్ సైనికులను సైతం ఆ నగరం నుంచి వెనక్కు వెళ్లాయి. ఉక్రెయిన్‌లోని అత్యంత కీలకమైన అవ్‌దివ్కా నగారాన్నిస్వాధీనపచుకున్న రష్యా సైనికులను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందించారు. ఇది కీలకమైన విజయంగా రష్యా తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన ద్వారా తెలిపింది. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి దీనిని ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com