Russia Invites : మే9న రావాలంటూ మోడీకి రష్యా ఆహ్వానం

ప్రధాని మోడీకి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా క్రైమ్లిన్ ఆహ్వాన లేఖ పంపింది. ఈ విషయాన్ని ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తన మిత్రదేశాలను ఈ వేడుకకు రష్యా ఆహ్వానిస్తోంది.
ఇందులో భాగంగానే ప్రధాని మోడీకి కూడా ఆహ్వానం పంపింది. విక్టరీ డే వేడుకలకు భారత ప్రధాని హాజరవుతా రని ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు. కాగా, గతేడాది జులైలో మోడీ రష్యా లో పర్యటించిన సంగతి తెలిసిందే. నాటి పర్యటన సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. మోడీ ఆహ్వానాన్ని పుతిన్ కూడా అంగీకరించారు. ఈ పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంతలోనే మరోసారి మాస్కో నుంచి మోడీకి ఆహ్వానం అందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com