Russia : 14 సంవత్సరాల పాటు యువతిని బంధించి, అత్యాచారం చేసి. .

Russia : 14 సంవత్సరాల పాటు యువతిని బంధించి, అత్యాచారం చేసి. .
పార్టీకి పిలిచి, సెక్స్ బానిసగా మార్చుకొని 1000 సార్లకు పైగా ...

రష్యాలో జరిగిన ఓ నీచమైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ రాక్షసుడు యువతికి పార్టీ అని చెప్పి ఇంటికి పిలిచి, ఆమెను బంధించి ఒకటి కాదు రెండు కాదు 14 సంవత్సరాలపాటు చిత్రహింసలకు గురి చేశాడు. తన ఇంటిపనులు, ఒంటి పనులు కూడా చేయించుకున్నాడు. తన శృంగారానికి బానిసగా మార్చుకున్నాడు. 1000 సార్లకు పైగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఎలాగోలా ఆమె ఆ రాక్షసుడి చెర నుంచి బయటపడి పోలీసుల్ని ఆశ్రయించింది.

పోలిసులు ఇచ్చిన సమాచారం ప్రకారం…

పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్‌లో వ్లాదిమిర్ చెస్కిడోవ్ అనే యాభై సంవత్సరాల వ్యక్తి 2009లో ఎకటరీనా అనే యువతిని కిడ్నాప్ చేశాడు. ఇంటికి ఆల్కహాల్ పార్టీకి పిలిచి.. ఆమెను బయటకు రాకుండా నిర్బంధించాడు. దాదాపు 1000కి పైగా సార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. కత్తితో బెదిరిస్తూ, ఇంట్లో పనులు చేయించుకునేవాడు.

ఆ కిరాతకుడి బారి నుంచి తప్పించుకోవడం కోసం ఎకటరీనా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆమె తరువాత 2011లో మరో మహిళను కూడా ఇలాగే తీసుకువచ్చిన నిందితుడు వచ్చిన మహిళ తనతో గొడవ పడిన కారణంగా కత్తితో అనేకసార్లు పొడిచి కిరాతకంగా చంపాడు. తరువాత వ్లాదిమిర్ మానసిక ఆరోగ్య పరిస్థితి మరీ దిగజారింది. అతను ఆసుపత్రికి వెళ్లాల్సి రావడంతో సరిగ్గా సమయం చూసుకొని వ్లాదిమిర్ తల్లి ఎకటరీనాను విడిపించడంలో సహాయం చేసింది. బయటకు వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు.


ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు వ్లాదిమిర్‌ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంటికి వెళ్లి పరిశీలించగా అక్కడ పోలీసులకు సెక్స్ టాయ్స్, పోర్న్ వీడియోస్ తో పాటు మానవ అవశేషాలు కూడా అక్కడ కనిపించాయి. దీంతో నిందితుడిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేశాడు. వ్లాదిమిర్ ఎలాగూ మానసిక రుగ్మతతో బాధపడుతుండటంతో. పోలీసులు అతనిని మానసిక వైద్యశాలలో ఉంచి చికిత్స అందిచే ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story