Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మాజీ అధ్యక్షుడు మోద్వదేవ్ హెచ్చరిక

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మాజీ అధ్యక్షుడు మోద్వదేవ్ హెచ్చరిక
Russia-Ukraine War: మ దేశానికి ముప్పు వచ్చిందంటే దేనికీ వెనకాడబోమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ దిమిత్రి మోద్వదేవ్ హెచ్చరించారు.

Russia-Ukraine War: తమ దేశానికి ముప్పు వచ్చిందంటే దేనికీ వెనకాడబోమని రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ దిమిత్రి మోద్వదేవ్ హెచ్చరించారు. ముప్పు ఒక స్థాయికి మించిందంటే ఉక్రెయిన్​పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని తేల్చి చెప్పారు. అందుకు ఎవరినీ పర్మిషన్ అడగనవసరం లేదని, చర్చలతో పనిలేదని క్లారటీ ఇచ్చేశాడు.

తమ విషయంలో వెస్ట్రన్‌ కంట్రీ లు జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని అన్నారు. దేశ ప్రజలకు ఆపద వస్తే న్యూక్లియర్ వెపన్స్‌తో సహా అన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తామని ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పిన మాటలను లైట్‌ తీసుకోవద్దంటూ మెద్వెదేవ్ హెచ్చరించారు. కేవలం ఉక్రెయిన్​ను భయపెట్టేందుకే పుతిన్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని పశ్చిమ దేశాలు అనుకుంటున్న నేపథ్యంలో మెద్వెదేవ్ కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇటీవ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో మరింత మంది సైనికులను సమీకరించాలని పాక్షిక సైనిక సమీకరణకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో రష్యాలో గతంలో మిలిటరీలో పనిచేసిన అనుభవం ఉన్న వారు, శిక్షణ పొందిన వారు యుద్ధంలోకి బలవంతంగా చేరేలా పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. పుతిన్ నిర్ణయంతో రష్యా యువతలో భయాందోళనలు ఏర్పడ్దాయి. దీంతో పెద్ద ఎత్తున రష్యా యువకులు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు.

ఇప్పటికే వేలాదిగా వాహనాలు జార్జియా దేశపు సరిహద్దుల్లో నిలిచాయి. రష్యా నుంచి పెద్ద ఎత్తున యువత జార్జియాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పాటు కజకిస్తాన్, ఫిన్లాండ్, మంగోలియా దేశాల్లోకి వెళ్లేందుకు రష్యా యువత ప్రయత్నిస్తోంది. దీంతో ఈ దేశాలకు రష్యాతో ఉన్న సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టాయి. జార్జియా వద్ద సరిహద్దు దాటేందుకు 48 గంటల సమయం పడుతోంది.

అయితే రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. మరోపక్క రష్యా ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. మిత్రదేశాల ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సైన్యాన్ని పెంచే దిశగా రిటైర్డ్ ఆర్మీని మళ్లీ రంగంలోకి దించేందుకు రష్యా సిద్ధమైంది. ఉక్రెయిన్​లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో రిఫరెండం మొద లుపెట్టింది.

ఆపై ఆ ప్రాంతాలన్నీ రష్యా సార్వభౌమత్వం కింద ఉన్నట్లు ప్రకటించాలన్నది పుతిన్ ఆలోచన అని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. ఆ ప్రాంతాల పై ఉక్రెయిన్​ దాడిచేస్తే అది రష్యాపై దాడిగానే పరిగణించి ఎలాంటి వెపన్స్ అయినా ఉపయోగించవచ్చని వెస్ట్రన్‌ కంట్రీస్‌ అనుమానిస్తున్నాయి.

ఇక అమెరికాకు షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్ కు రష్యా పౌరసత్వం మంజూరు చేస్తూ డిక్రీపై సంతకం చేశారు. 39 ఏళ్ల స్నోడెన్ అమెరికా నుంచి పారిపోయి రష్యాలో తలదాచుకుంటున్నాడు. 2013లో అమెరికా రహస్య ఫైళ్లను లీక్ చేసిన తర్వాత రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story