Ukraine-Russia: ఉక్రెయిన్‌పై రష్యా భీకరదాడులు..

ఉక్రెయిన్-రష్యా మధ్య ఓ వైపు శాంతి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. అలాస్కా వేదికగా పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్‌స్కీ, పశ్చిమ దేశాధినేతలతో కూడా చర్చలు జరిపారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. ఇంతలోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు పాల్పడింది. తాజాగా పుతిన్ చైనాలో సైనిక కవాతు వీక్షిస్తుండగా.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దీంతో నాటో మిత్రదేశమైన పోలాండ్ జెట్‌లతో యుద్ధానికి దిగింది.
బుధవారం ఉక్రెయిన్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. రష్యా భారీ వైమానిక దాడిని ప్రారంభించింది. కైవ్ నుంచి పశ్చిమాన ఉన్న లివివ్, వోలిన్.. ఇలా 24 ప్రాంతాలను తాకాయి. దీంతో ఉక్రెయిన్ వైమానిక దళం తప్పికొట్టింది. మూడు క్షిపణులు, 69 స్ట్రైక్ డోన్లను 14 చోట్ల ఢీకొట్టాయి. కూలిన శిథిలాలు 14 చోట్ల పడిపోయాయి.
మాస్కో 502 మానవరహిత వైమానిక విమానాలు, 24 క్షిపణుల ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. పౌరులకు గాయాలయ్యాని పేర్కొన్నారు. ప్రజా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు చెప్పారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగాలని ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు కూడా జరిగాయి. కానీ సత్ఫాలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి పుతిన్, జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. అయినా కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. తాజాగా యథావిధిగా రష్యా దాడులు చేస్తూనే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com