Russia : జర్నలిస్టుకు 25 ఏళ్ల జైలు శిక్ష
రష్యాలో అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై అణచివేత కొనసాగుతోంది. రష్యాలో ప్రముఖ జర్నలిస్ట్, ప్రతిపక్షనేత, పుతిన్ విమర్శకుడు వ్లాదిమిర్ కారా ముర్జా జూనియర్‌కు 25 ఏళ్ల జైలుశిక్ష విధించడాన్ని మాస్కో కోర్టు సమర్థించింది. 2022లో అరిజోనా ప్రతినిధుల సభలో ప్రసంగించిన కారాముర్జా.. ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యను ఖండించారు. దీంతో సైన్యం గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారన్న నేరం కింద ఆయనకు రష్యాలోని ఓ కోర్టు ఏప్రిల్‌లో 25ఏళ్ల జైలుశిక్ష విధించింది. దేశద్రోహం కేసులో అతనికి ఈ శిక్షను ఖరారు చేశారు. గతం కారా ముర్జాపై 2సార్లు విషప్రయోగాలు జరగ్గా.. ఆయన ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ విషం అతన్ని పై తీవ్ర ప్రభావాన్ని చూపిందని ముర్జా న్యాయవాది తెలిపారు.
అయితే జర్నలిస్టు ముర్జా.. తాను మాట్లాడిన ప్రతి పదానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పాడు. తన అభిప్రాయాల క పట్ల తానేమీ చింతించడం లేదని, గర్వంగా ఉందని అన్నారు. ఉక్రెయిన్ వార్‌పై విమర్శనాత్మక కథనాలు రాసిన ముర్జా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా కూడా విమర్శలు చేశారు. రష్యా అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకునేలా పాశ్చాత్య ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చే విధంగా ముర్జా తన కథనాలను రాశారు.
కాగా.. పుతిన్ హయాంలో క్రెమ్లిన్‌ను సవాల్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని, వేలాదిమంది నిరసనకారులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుతిన్ ను వ్యతిరేకించే చాలా మంది ప్రత్యర్థులు రష్యా నుంచి పారిపోయారు లేదా జైల్లో బంధించబడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com