Russia, Ukraine War: బూడిద కుప్పగా మారిన డొనెట్స్క్

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన నాటి నుంచి ఊహించని వినాశనం చోటు చేసుకొంది. కళ్లముందే మేరియుపోల్ వంటి నగరాలు నేలమట్టమయ్యాయి. తాజాగా డొనెట్స్క్ ప్రాంతంలోని ఓ పట్టణం ఏ స్థాయిలో ధ్వంసమైందో తెలియజేస్తూ ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ ఓ ట్వీట్ చేసింది. డ్రోన్ నుంచి దీనికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. డొనెట్స్క్‌లోని మరింక అనే నగరం దృశ్యాలు కలచివేసేలా ఉన్నాయి. కనుచూపు మేరలో మొత్తం భూమి కాలిబూడిదైపోయింది.
గతంలో దాదాపు 10వేల మంది నివాసం ఉన్న ఈ నగరంలో ఇప్పుడు ఎవరూ లేరు. ఇళ్లు పూర్తిగా శిథిలమైపోయాయి. ఈ నగరంలో పేలుడు జరగని ప్రాంతమంటూ కనిపించదు. డాన్‌బాస్ వేర్పాటువాదులు దీనిపై తొలిసారి దాడి చేసి ఆధీనంలోకి తీసుకొన్నారు. అయితే నాలుగు నెలల తర్వాత ఉక్రెయిన్ ఈ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ పోరాటాల దెబ్బకు నగరం మొత్తం బూడిద కుప్పగా మారిపోయింది. అక్కడ ఒక్క మనిషి కూడా జీవించడానికి అవకాశం లేకుండా పోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com