Ukraine: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు..

రష్యా – ఉక్రెయిన్దే శాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి తమ ఉక్రెయిన్‌లోని జైలుపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 17 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ జపోర్జియా ప్రాంతంలోని జైలుపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. బిలెన్‌కివ్స్కాలోని మరో కాలనీపై కూడా ఈ దాడుల ప్రభావం కన్పించిందని పేర్కొన్నారు. దాడిలో జైలు డైనింగ్ హాలుతో సహా పరిపాలనా, క్వారంటైన్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నాయని వెల్లడించారు. మరో మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతిన్నదని, ప్రసూతి ఆస్పత్రితో సహా పలు ఆస్పత్రుల్లోని వైద్య సౌకర్యాలు నాశనమయ్యాయని తెలిపారు.
ఈ దాడుల సమయంలో ఖైదీలు ఎవరూ జైలు నుంచి తప్పించుకోలేదని అధికారులు స్పష్టంచేశారు. దాడిని తాము తీవ్రంగా ఖండిస్తు్న్నామని పేర్కొన్నారు. జైళ్ల లాంటి పౌరుల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. రష్యా ప్రయోగించిన వాటిల్లో 32 డ్రోన్‌లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కాగా రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోంది.
పరస్పరం డ్రోన్ల దాడులతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపి శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శాంతిచర్చలకు వచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇటీవల 50 రోజులు గడువు ఇచ్చారు. తాజాగా ఆ గడువును కూడా ఆయన కుదించారు. మరో 10-12 రోజుల్లో శాంతిచర్చలు కొలిక్కి రాకపోతే ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు మరింత పెంచుతానని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com