Russia: రష్యా రాయబారి మిఖాయిల్ ఉలియానోవ్ ట్వీట్ వైరల్

సిరియాలో తిరుగుబాటు తర్వాత బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి పారిపోయారు. బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబానికి రష్యా ఆశ్రయం ఇచ్చింది. మానవతా దృక్పథంతో ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు తెలిపింది. మాస్కోలో ఉన్నారని రష్యా రాయబారి మిఖాయిల్ ఉలియానోవ్ తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం.. ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. “బ్రేకింగ్! అస్సాద్, అతని కుటుంబ సభ్యులు మాస్కోలో ఉన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో రష్యా తన స్నేహితులకు ద్రోహం చేయదు. ఇదే రష్యా- యూఎస్ మధ్య వ్యత్యాసం.” అని ఆయన పేర్కొన్నారు.
కాగా.. రెబల్స్ దూకుడుతో సిరియర్ బలగాలు, వారికి అండగా నిలిచిన రష్యన్ బలగాలు తోకముడిచాయి. అధికారం పోవడం ఖాయంగా కనిపించడంతో అస్సాద్ ముందుగా తన భార్య, పిల్లల్ని రష్యాకు తరలించారు. అనంతరం ఆయన కూడా దేశం వదిలిపెట్టారు. శాంతియుతంగా అధికారాన్ని అప్పగించాలనే ఆదేశాలు ఇవ్వడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ తన పదవి నుంచి దిగిపోయి, దేశం వదిలిపెట్టినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. అసద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పలేమని, అతని నిష్క్రమణకు సంబంధించిన చర్చల్లో రష్యా పాల్గొనలేదని పేర్కొంది. అయితే.. సిరియాలోని రష్యా సైనిక స్థావరాలను హైఅలర్ట్‌లో ఉంచామని, ప్రస్తుతానికి వాటికి ఎలాంటి తీవ్రమైన ముప్పు లేదని చెప్పింది.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులు రష్యాకి చేరుకున్నారు. ఈ మేరకు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థలు నివేదించాయి. ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు సిరియాను తమ ఆధీనంలోకి తీసుకున్న కోవడంతో తన కుటుంబంతోపాటు అధ్యక్షుడు రష్యాలోని మాస్కోకి చేరుకున్నారు.”అస్సాద్, ఆయన కుటుంబ సభ్యులకు మానవతా దృక్పథంతో రష్యా ఆశ్రయం కల్పించింది” అని స్థానిక వార్తా సంస్థ నివేదిక పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com