Russia Corona : రష్యాలో ఆగని కేసులు, మరణాలు..!

Russia Corona : రష్యాలో ఆగని కేసులు, మరణాలు..!
Russia Corona : రష్యాలో కరోనా కేసులు, మరణాలు అగడం లేదు.. గడిచిన 24గంటల్లో అక్కడ.. 39,930 కొత్త కేసులు నమోదు కాగా 1069మంది మరణించారు

Russia Corona : రష్యాలో కరోనా కేసులు, మరణాలు అగడం లేదు.. గడిచిన 24గంటల్లో అక్కడ.. 39,930 కొత్త కేసులు నమోదు కాగా 1069మంది మరణించారు. ఆ దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇన్ని కేసులు రావడం ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇటీవల1075 మంది ఒక్కరోజులో ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రష్యాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 8.2మిలియన్లకు చేరగా, 2,31,669మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక అత్యధిక మరణాలు సంభవించిన దేశాలలో ఐదో స్థానంలో రష్యా ఉంది. వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉండటం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు.

అటు దేశంలో కరోనాని అదుపు చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. దీనితో ఈ నెల 30 నుంచి నవంబర్‌ 7వరకు సెలవులు ప్రకటించారు. గురువారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నారు. పాఠశాలలు, జిమ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలతో పాటు అనేక స్టోర్లను 11 రోజుల పాటు మూసివేయనున్నారు. రెస్టారెంట్లు, కేఫ్‌లకు మాత్రం డెలివరీలకు మాత్రం అనుమతించనున్నారు. ఫుడ్‌ స్టోర్లు, ఫార్మసీలు మాత్రం తెరిచిఉంచేందుకు అనుమతించనున్నారు.

Tags

Next Story