Trump Life Threat: ట్రంప్‌నకు ముప్పుంది: పుతిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత పుతిన్ తాజాగా ప్రశంసలు కురిపించాడు. ఆయన తెలివైన రాజకీయ నేత అని కొనియాడారు. అయితే, ఇటీవల ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకున్న ఘటనలను గుర్తు చేసుకున్నారు. అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులను పాటించారని మండిపడ్డారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం కూడా నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పుతిన్ చెప్పుకొచ్చారు. ఒకటికంటే ఎక్కు వసార్లు ట్రంప్ పై హత్యాయత్నాలు జరగడం ఆలోచించాల్సిన విషయం అని తెలిపారు. నా ఆలోచన ప్రకారం.. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం సేఫ్ గా లేరు.. ఆయన తెలివైన వ్యక్తి కాబట్టి.. ముప్పును పసిగట్టి జాగ్రత్తగా ఉంటారని నమ్ముతున్నాను అని వ్లాదిమీర్ పుతిన్ వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com