Luna 25 crash: 50 ఏళ్ల ఆలస్యమే కొంపముంచింది

Luna 25 crash: 50 ఏళ్ల ఆలస్యమే కొంపముంచింది
X
లూనా-25 క్రాష్‌ ల్యాండింగ్‌పై తొలిసారి స్పందించిన రష్యా... తమ దేశానికి చెత్త నిర్ణయమన్న రోస్‌కాస్మోస్‌ చీఫ్‌

చంద్రుడిపై పరిశోధనల(Moon Mission) కోసం దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌( Luna 25 crash) జాబిల్లిపై దిగకముందే కుప్పకూలింది. ఈ విషయంపై తొలిసారి రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్‌( Roscosmos) చీఫ్ యూరీ బొరిసొవ్‌(Russian space agency chief Yuri Borisov‌) స్పందించారు. ఇంజిన్లు సరిగ్గా మూసుకోకపోవడం వల్ల తమ వ్యోమనౌక క్రాష్‌ అయ్యినట్లు తెలిపారు. చంద్రుడిపై అన్వేషణ కోసం దశాబ్దాల విరామం తర్వాత ప్రయోగం చేపట్టడమే ఈ వైఫల్యాలకు కారణమని పేర్కొంది. లూనా-25ని ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టేందుకు వ్యోమనౌక ఇంజిన్లను గత శనివారం ఆన్‌ చేశామని అనంతరం అవి సరైన విధంగా మూసుకుపోలేదని వివరించారు. ప్రణాళిక ప్రకారం అవి 84 సెకన్లు పనిచేయాలని( planned 84 seconds) కానీ, 127 సెకన్ల( worked for 127 seconds) పాటు పనిచేశాయని తెలిపారు. అత్యవసర పరిస్థితి తలెత్తడానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు.


రష్యా కాలమానం ప్రకారం గత శనివారం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాల వరకు వ్యోమనౌక రోస్‌కాస్మోస్‌తో కాంటాక్టులోనే ఉందని రోస్‌కాస్మోస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యూరీ బొరిసొవ్‌ పేర్కొన్నారు. కమ్యూనికేషన్‌ తెగిపోయిన తర్వాత అనియంత్రిత కక్ష్యలోకి వెళ్లిన ల్యాండర్‌ చంద్రుడిపై కుప్పకూలిపోయిందని తెలిపారు. చంద్రుడిపై పరిశోధన కార్యక్రమాలకు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం ఇవ్వడం( almost 50 years ) ఈ వైఫల్యానికి ప్రధాన కారణమని బొరిసోవ్‌ పేర్కొన్నారు. మూన్‌ మిషన్‌(lunar mission)లను దశాబ్దాల పాటు పక్కనపెట్టడం రష్యా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత చెత్తదని విమర్శించారు. జాబిల్లిపై సహజ వనరుల కోసం రేసు మొదలైందని ఆయన తెలిపారు. అంతరిక్ష అన్వేషణకు చంద్రుడు సరైన వేదిక కానుందన్నారు.


అంతరిక్ష రంగంలో మరో ముందడుగు కోసం రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ అనూహ్యంగా విఫలమైంది. కక్ష్య మార్పు సమయంలో అదుపుకోల్పోయిన ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. చంద్రయాన్-3 కంటే ఆలస్యంగా ప్రయోగించిన లూనా-2 దానికన్నా ముందుగానే అంటే సోమవారం నాటికే చంద్రుడి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవుతుందని అంచనా వేశారు. అయితే శనివారం మధ్యాహ్నం 2:57 గంటల తర్వాత లూనా-25తో సంబంధాలు తెగిపోయి కుప్పకూలిందని రష్యా స్టేట్ స్పేస్ కార్పొరేషన్ రోస్‌కాస్మోస్ ప్రకటించింది.

Tags

Next Story