ఉత్తర కొరియాలో మొదలైన పర్యాటకం.. వీరికి మాత్రమే ఎంట్రీ

ఉత్తర కొరియాలో మొదలైన పర్యాటకం.. వీరికి మాత్రమే ఎంట్రీ
ప్యాంగ్యాంగ్‌ కు చేరిన రష్యా పర్యాటకులు బృందం

ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి వారు చెబితే కానీ తెలియదు. అలాంటి ఆ దేశంలో దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత తొలి విదేశీ పర్యాటకులు అడుగుపెట్టారు. రష్యాకు చెందిన పర్యాటకులు బృందం ఉత్తర కొరియాను సందర్శించింది. కొవిడ్‌ మహమ్మరి, ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరైన తమ దేశానికి వచ్చిన తొలి పర్యాటకుల బృందాన్నిఉత్తర కొరియా స్వాగతించింది. రష్యాలోని వ్లాదివోస్తోక్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన రష్యన్‌ పర్యాటకులు ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు చేరుకున్నారు. మెుదట రష్యన్‌ బృందం ప్యాంగ్యాంగ్‌ను సందర్శిస్తుందని ఆ పర్యటన నిర్వహణ బాధ్యతలను చూస్తున్నవోస్టాక్‌ ఇంటర్‌ ఏజెన్సీ తెలిపింది.రష్యాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఈ బృందంలో ఉన్నట్లు వెల్లడించింది. చాలా మంది ఉత్తర కొరియా పర్యటనకు రావాలనుకునే వారు ఉన్నారని వారందరనీ సాదరంగా స్వాగతిస్తున్నట్లు చెప్పింది.


స్నోబోర్డింగ్‌పై ఆసక్తి ఉన్న వాళ్లు స్కీయింగ్‌ చేయడానికి ఎక్కువగాఉత్తర కొరియాకు వస్తారని వోస్టాక్‌ ఇంటర్‌ ఏజెన్సీ పేర్కొంది. తాజాగా పర్యటనకు వచ్చినరష్యన్‌ బృందంలోనూ స్కీయింగ్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు ఉన్నారని తెలిపింది. ఈ పర్యాటకుల బృందం రాబోయే రోజుల్లో ఉత్తర కొరియాకు వచ్చేందుకు విదేశీ పర్యాటకులకు మార్గం సుగమం చేస్తోందని వివరించింది. గతేడాది అక్టోబర్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉత్తర కొరియాను వెకేషన్‌ డెస్టినేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్యన్‌ పర్యాటకులు ఉత్తర కొరియా సందర్శనకు వెళ్లారు.

గతకొంతకాలంగా ఉత్తరకొరియా, రష్యా మధ్య సంబంధాలు బలపేతమయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌... రష్యాలో పర్యటించిన తర్వాత ఇరుదేశాల మధ్య మైత్రి బంధం మరింత బలపడింది. అటు ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యాపై యూరప్‌, అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధించడంతో.... రష్యన్‌లు ఆ దేశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఉత్తరకొరియా వైపు చూస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు

Tags

Read MoreRead Less
Next Story